ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలకే మంచి కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తున్నాయి. పెద్ద సినిమాలు రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలుగా ఎక్కువగా వస్తూ ఉండటంతో ప్రేక్షకులు అటు వైపు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. తక్కువ బడ్జెట్లో రూపొందిన సరే చిన్న సినిమాలే సరికొత్తగా ఉండడంతో వాటి వైపే ప్రేక్షకులు పరుగులు పెడుతున్నారు. దానితో ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం చిన్న సినిమాలకే పెద్ద శాతం లాభాలు వస్తున్నాయి. అలా చిన్న సినిమాగా ఈ మధ్యకాలంలో థియేటర్లలో విడుదల అయిన మూవీ 35 చిన్న కథ కాదు.
ఈ మూవీ లో నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించగా , ప్రియదర్శి , భాగ్యరాజా , గౌతమి ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 6 వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి స్థాయి కలెక్షన్లను వసూలు చేసింది. ఈ రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 33 లక్షల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 14 లక్షలు , ఉత్తరాంధ్రలో 26 లక్షల కలెక్షన్లు వచ్చాయి.
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 73 లక్షల కలెక్షన్లు దక్కగా , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12 లక్షలు , ఓవర్సీస్ లో 20 లక్షల కలెక్షన్లు వచ్చాయి. టోటల్ గా వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో ఈ మూవీ కి 1.05 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 2 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 1.05 కోట్ల షేర్ కలెక్షన్లను ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఇంకా ఈ మూవీ 95 లక్షల షేర్ కలక్షన్లను రాబడితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.