ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్..పవన్ కళ్యాణ్ తోనే సినిమా ?

frame ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్..పవన్ కళ్యాణ్ తోనే సినిమా ?

Veldandi Saikiran
అనన్య నాగళ్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ దక్కించుకుంది. మొదట షాది అనే షార్ట్ ఫిలింలో నటించిన అనన్య తన నటనతో ఆకట్టుకుంది. దీంతో 2017లో షార్ట్ ఫిలిం కేటగిరీలో సైమా అవార్డును గెలుచుకుంది. అంతే ఒక్కసారిగా సెన్సేషన్ అవడంతో పాటు సినిమా మేకర్ల కంటపడింది. ఇక అప్పటినుంచి అనన్య మంచి అవకాశాలను అందుకుంది.

షార్ట్ ఫిలింతోనే పాపులర్ అయిన ఈ బ్యూటీ మల్లేశం అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నేచురల్ నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలోనూ....దివ్య నాయక్ అనే పాత్రతో మెప్పించింది. అనన్య వ్యక్తిగత విషయానికి వస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించి హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసుకుంది.

అనంతరం ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేసింది. ఓవైపు జాబ్ చేస్తూనే మరోవైపు నటన మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేసింది. అలా పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. వకీల్ సాబ్ సినిమా తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు వచ్చాయి. మాస్ట్రో, శకుంతలం, ఊర్వశివో రాక్షసివో, మళ్లీ పెళ్లి వంటి చిత్రాల్లో నటించి ఇప్పుడిప్పుడే లేడీ ఓరియంటెడ్ సినిమాలోని నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.
తాజాగా అనన్య రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వర్షాలకు చాలామంది నష్టపోయారు. వరద బాధితుల కోసం అనన్య తనవంతుగా రూ. 5 లక్షల విరాళాన్ని అందించింది. ఇది ఆమె సామాజిక మరియు మానవతా భావనను తెలియజేస్తుంది. ఇదిలా ఉండ గా... తాజాగా హీరోయిన్ అనన్య సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంది. ఈ సమయంలోనే అనన్యకు సంబంధించిన కొన్ని చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: