యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ‘దేవర’ ట్రైలర్ వచ్చేసింది. యాక్షన్ సీక్వెన్స్ ను పెద్ద పీటవేసిన మేకర్స్ అలాగే ట్రైలర్ ను కట్ చేశారు. తారక్ ఫ్యాన్స్ కు ఇది విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఇక విడుదలైన కొన్ని గంటల్లోనే 35 మిలియన్లకు పైగా వ్యూస్ క్రాస్ చేస్తూ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాడు తారక్. ఈ క్రమంలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో తారక్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ ఒక్క షాట్ కోసమే ఒక రోజు మెుత్తం షూటింగ్ చేశామని చెప్పుకొచ్చాడు.ఈ విషయాన్నీ మేకర్స్ తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. సముద్రం ఉప్పొంగినప్పుడు ఫలితం ఈ విధంగానే ఉంటుంది అని పేర్కొన్నారు.దేవర ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ను అల్లాడిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ అండ్ విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ.. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ముంబై వేదికగా ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనికి ఆడియెన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే 35 మిలియన్లకు పైగా వ్యూస్ తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. తండ్రీ కొడుకులుగా తారక్ తన నట విశ్వరూపం చూపించాడు. ఇక యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.
సముద్రంలో వచ్చే ఫైట్స్ సీక్వెన్స్ కు థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఇక దేవరలో చివరి 40 నిమిషాలకు ప్రేక్షకులు పిచ్చెక్కిపోతారని స్వయంగా తారకే చెప్పడంతో.. సినిమాపై ఇంకాస్త హైప్ క్రియేట్ అయ్యింది.కాగా.. ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో తారక్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. “దేవరలో కేవలం యాక్షన్ సీక్వెన్సే కాదు.. ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది,ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. చివరి 40 నిమిషాలకి థియేటర్లు తగలబడిపోతాయి. ఇక సముద్రంలో షార్క్ పై నేను కనిపించే షాట్ తీయడానికి ఎక్కువ టైమ్ తీసుకున్నాం. ఒక రోజు మెుత్తం ఆ షాట్ కే కేటాయించాం. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి చూడటానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు తారక్. ఇక ఈ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ నటిస్తుండగా.. విలన్ గా సైఫ్ అలీఖాన్ చేస్తున్నాడు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే దేవర ట్రైలర్ మాత్రం సినిమాపై భారీ అంచనాలను పెంచిందనే చెప్పాలి. అదీకాక ఇప్పటికే యూఎస్ మార్కెట్ లో ప్రీ సేల్స్ లో తారక్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. మూవీ రిలీజ్ కు ముందే 1 మిలియన్ డాలర్లను చేరుకున్న తొలి టాలీవుడ్ సినిమాగా దేవర రికార్డ్ నెలకొల్పింది.