2024 వ సంవత్సరంలో అనేక తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. అందులో కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నాయి. కానీ ఆ సినిమాలలో కూడా చాలా వరకు సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ఈ సంవత్సరం ఇప్పటివరకు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ సినిమాల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.
ధనుష్ హీరోగా రూపొందిన కెప్టెన్ మిల్లర్ సినిమా కొంత కాలం క్రితమే తెలుగులో భారీ ఎత్తున విడుదల అయింది. కానీ ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. విష్ణు విశాల్ హీరోగా రూపొందిన లాల్ సలాం సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదల అయ్యింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. విశాల్ హీరోగా రూపొందిన రత్నం మూవీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి అంచనాలు నడుమే విడుదల అయింది. కానీ ఈ సినిమా కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. తమన్నా , రాశి కన్నా కీలక పాత్రల్లో రూపొందిన "అరన్మనై 4" సినిమా తెలుగులో బాక్ అనే టైటిల్ తో విడుదల అయింది. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.
విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన మహారాజ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు 2 మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ధనుష్ హీరోగా రూపొందిన రాయన్ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. డిమోంటి కాలనీ 2 సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. తంగాలాన్ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. తలపతి విజయ్ హీరోగా రూపొందిన ది గోట్ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఈ సినిమా కూడా అపజయాన్నే తెలుగు బాక్సాఫీస్ దగ్గర అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.