సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సినిమాకు ఒక్కో మాధురి రిజల్ట్ వస్తూ ఉంటుంది. కొన్ని సినిమాలకు విడుదల అయిన మొదటి రోజు బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిన కూడా ఆ తర్వాత ఆ సినిమాలో ఆ స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేక పోతాయి. మరి కొన్ని సినిమాలకు రిలీజ్ అయిన మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా ఆ తర్వాత కామన్ ఆడియన్స్ నుండి ఆ సినిమాలకు బ్లాక్ బస్టర్ టాక్ రావడం , దానితో సినిమాలకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు రావడం జరిగిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
ఇలాంటి కొన్ని విషయాల గురించి నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు తాజాగా చెప్పుకొచ్చాడు. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా దిల్ రాజు మాట్లాడుతూ ... సినిమా థియేటర్లో చాలా మంది ఒకే సారి సినిమాను చూస్తూ ఉంటారు. అందులో ఎక్కువ మంది కి నచ్చిన సినిమా హిట్ అవుతుంది. తక్కువ మంది కి నచ్చిన సినిమా ఫ్లాప్ అవుతుంది. అలాగే మొదటి రోజు టాక్ తో సినిమా విజయాన్ని అస్సలు అంచనా వేయలేం. ఎందుకు అంటే మొదటి రోజు అనేక మంది అనాలసిస్ చేసే వ్యక్తులు సినిమాలను చూస్తూ ఉంటారు. దాని వల్ల సినిమాలకు మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చిన ఆ తర్వాత బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు అనేకం ఉన్నాయి.
అద్భుతమైన విజయం సాధించినటు వంటి ఆర్ ఆర్ ఆర్ , అఖండ , కే జీ ఎఫ్ సినిమాలకు కూడా మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఆ సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను చేసి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అందుకే మొదటి రోజు టాక్ ను ఎప్పుడు పట్టించుకోకూడదు. రెండవ రోజు నుండి కామన్ ఆడియన్స్ వస్తారు. వారికి సినిమా నచ్చితే అది హిట్టు , లేదంటే ఆ సినిమా ఫ్లాప్ అని దిల్ రాజు తాజాగా చెప్పుకొచ్చాడు.