తెలుగు సినీ పరిశ్రమలలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే ప్రకటించింది.
ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో సెప్టెంబర్ 10 వ తేదీన అనగా ఈ రోజు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ట్రైలర్ నిడివి చాలా ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ 2 నిమిషాల 50 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ 2 నిమిషాల 50 సెకండ్లతో నిడివి తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అంటే ఈ ట్రైలర్ లో చాలా విషయాలు మేకర్స్ రివిల్ చేసే అవకాశం ఉంది. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇకపోతే దేవర మూవీ పై మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.