Jr. ఎన్టీఆర్: స్టార్ డైరెక్టర్ తో మీటింగ్.. కాంబినేషన్ కుదిరితే బ్లాక్ బాస్టరే..!

Divya
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ట్రైలర్ రేపటి రోజున రిలీజ్ కాబోతోంది. ఇందుకోసం ముంబై కూడా వెళ్ళినట్లు సమాచారం. ఈవెంట్ ని కూడా చిత్ర బృందం భారీగానే ప్లాన్ చేస్తున్నారు. అయితే ట్రైలర్ రిలీజ్ కి ముందే స్టార్ డైరెక్టర్గా పేరుపొందిన సందీప్ రెడ్డి వంగతో జూనియర్ ఎన్టీఆర్ మీటింగ్ అయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ స్టే చేస్తున్న హోటల్ కి వెళ్లి మరి సందీప్ రెడ్డివంగా కలిసినట్లుగా సమాచారం. అలా జూనియర్ ఎన్టీఆర్ తో కొద్దిసేపు మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 దేవర మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందీప్ రెడ్డి వంగ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాయి.  గత ఏడాది యానిమల్ సినిమాతో మరొకసారి మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన తదుపరి చిత్రం ప్రభాస్ స్పిరిట్ సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్లాల ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ T- సిరీస్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.

కానీ జూనియర్ ఎన్టీఆర్ తో స్వయంగా డైరెక్టర్ సందీప్ రెడ్డివంగ మీట్ అవడంతో అభిమానులు ఏదైనా వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందా అనే విధంగా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్లో కనుక సినిమా హిట్టు పడితే ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అంటూ అభిమానులు ధిమా చేస్తున్నారు. మరి రేపటి రోజున ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు సందీప్ రెడ్డి వంగ వచ్చారంటే కచ్చితంగా సినిమా అప్డేట్ గురించి చెబుతారని ఆశగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ ఫొటోస్ అయితే వైరల్ గా మారుతోంది. ఎన్టీఆర్ దేవర చిత్రం తర్వాత వార్-2 సినిమాలో నటించబోతున్నారు. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: