విక్టరీ వెంకటేష్ తాజాగా కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ లో వెంకీ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే ఈ మూవీలో మరో అతిథి పాత్ర ఉందట. ఈ పాత్రలో ఓ బాలీవుడ్ స్టార్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఆ స్టార్ హీరో ఎవరో కాదు ‘సల్మాన్ ఖాన్’ అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్
అవుతున్నాయి. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇకపోతే వెంకటేష్ తన కెరీర్‌లో ఇప్పటికే అనేక విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో 76వ సినిమా కావడం విశేషం. అనిల్ రావిపూడి తన సినిమాల్లో కామెడీ, యాక్షన్, సెంటిమెంట్‌లను అద్భుతంగా కలిపి ప్రేక్షకులను అలరిస్తారు. ఈ సినిమాలో కూడా ఆయన తనదైన ముద్ర వేస్తారని అంచనా. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా పొల్లాచ్చిలో ఈ సినిమా షెడ్యూల్ జరిగింది. భాను మాస్టర్ కొరియోగ్రఫీ లో వెంకటేష్
,ఐశ్వర్య రాజేష్ ల పై ఓ సాంగ్ సీక్వెన్స్ ను షూట్ చేసారు. ఈ సాంగ్ లో భార్య భర్తలుగా వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ కనిపించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి వెంకటేష్ ఈ సినిమాతో ఎంతటి విజయాన్ని అందుకుంటడో చూడాలి మరి.