ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా...?
స్నేహ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషలలో సినిమాలు చేస్తూ సినీ అభిమానులను ఆకట్టుకుంది. కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన స్నేహ తన కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే తమిళ నటుడు ప్రసన్నను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. గత కొంతకాలం నుంచి స్నేహ మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.
హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో కేవలం అక్క, చెల్లి, వదిన పాత్రలలో నటిస్తోంది. అంతేకాకుండా పలు షోలలో కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది. స్నేహ అందానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. స్నేహ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడంతో తన అభిమానులు ఎంతగానో సంబరపడిపోయారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే స్నేహ సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉంటుంది.
ఇదిలా ఉండగా... సోషల్ మీడియాకు స్నేహ చాలా దూరంగా ఉంటారు. ఏవో కొన్ని సందర్భాలలో తప్ప తనకు సంబంధించిన అన్ని విషయాలను పెద్దగా షేర్ చేసుకోదు. ఈ క్రమంలోనే స్నేహకు సంబంధించిన చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో స్నేహ ఎంతో క్యూట్ గా, అందంగా ఉంది. అయితే ఈ ఫోటో చూసిన చాలామంది స్నేహ చిన్నప్పుడు కూడా చాలా అందంగా ఉందని, ఇప్పుడు కూడా అంతే అందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.