వినాయక చవితి స్పెషల్.. కుబేర నుండి పోస్టర్..!?

Anilkumar
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన కథానాయికగా నటించగా.. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన నాగార్జున ఫస్ట్ లుక్ వీడియో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా..    ఆయన పుట్టినరోజు సందర్భంగా మరో స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ లో ‘హ్యాపీ బర్త్ డే వన్ అండ్ ఓన్లీ కింగ్’ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక నాగార్జున ఫస్ట్ లుక్ వీడియోలో డబ్బు కట్టలతో ఉన్న లారీ విజువల్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.

 అంతే కాదు రష్మిక,  ధనుష్ గ్లిమ్ప్స్  వీడియోలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలవుండగా నేడు వినాయక చవితి సందర్భంగా కుబేరా టీం గణేష్ చతుర్థి  శుభాకాంక్షలు తెలుపుతూ.. కుబేర మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఒకవైపు ధనుష్ ఉండగా.. నాగార్జున ఉన్నాడు. సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్మోహన్‌రావు కలిసి నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్‌, అందిస్తున్నారు. టాలీవుడ్‌ కింగ్ నాగార్జున గత

 కొంత కాలంగా వరుసగా తన సినిమాలతో నిరాశ పరుస్తూ వస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన నటిస్తున్న కుబేరా సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. శేఖర్ కమ్ముల సినిమా అంటే మినిమం గ్యారెంటీ సినిమాగా పేరుంది. ఈయన గత చిత్రాలు ఫిదా, లవ్‌ స్టోరీ లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. చాలా గ్యాప్‌ తీసుకుని, స్క్రిప్ట్‌ పై చాలా వర్క్ చేసిన తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు. ధనుష్ ఈ కథపై చాలా ఆసక్తి ని కనబర్చాడనే ప్రచారం జరిగింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: