మీనాక్షి చేతిలో ఏకంగా అన్ని సినిమాలు.. అవి హిట్టయితే స్టార్ హీరోయిన్ అయినట్లే..?

Pulgam Srinivas
మోడలింగ్ రంగం నుండి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయిన ఈ మూవీ ద్వారా మీనాక్షి కి మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కిలాడి సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె ఆ మూవీ లో అందాలను విపరీతంగా ఆరబోయడంతో ఈ మూవీ తర్వాత నుండి మీనాక్షి కి తెలుగులో అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి.

అందులో కనీసం రెండు , మూడు సినిమాలు మంచి విజయాలను సాధించిన కూడా ఈమె తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న మట్కా అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తో పాటు టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న మెకానిక్ రాఖి అనే సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న లక్కీ భాస్కర్ మూవీ లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర మూవీ లో ఈ నటి ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇలా ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం ఈ నాలుగు క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇందులో కనీసం రెండు , మూడు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న కూడా మీనాక్షి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. మరి ఈ సినిమాలతో ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి విజయాలు దక్కుతాయో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: