దేవర రిలీజ్ కాకముందే మరో బడా ప్రాజెక్ట్ ఒప్పుకున్న జాన్వీ కపూర్..!?

frame దేవర రిలీజ్ కాకముందే మరో బడా ప్రాజెక్ట్ ఒప్పుకున్న జాన్వీ కపూర్..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘దేవర’. దీనిని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నాడు. మిక్కిలినేని సుధాకర్‌, కొసరాజు హరికృష్ణ ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇందులో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే దేవర సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ భారీ హైప్‌ను పెంచేశాయి. ఇక ఇటీవల విడుదలైన చుట్టమల్లె సాంగ్ అయితే విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తాజాగా  ఈ చిత్రం నుంచి ‘దావుడి..’ అనే వీడియో సాంగ్‌ను విడుద‌ల

 చేశారు. ఇక ఎప్పటిలాగే ఎన్టీఆర్ డాన్స్ అదరగొట్టేశారు. ముఖ్యంగా దావుడి పాటలో స్టైలీష్ డ్యాన్స్ స్టెప్పులతో అభిమానులను ఊర్రుతలూగించారు. ఎన‌ర్జిటిక్‌ పెర్ఫామెన్స్‌తో అదుర్స్ అనిపించారు. అటు తారక్ తో పోటీపడి మరీ స్టెప్పులు అదరగొట్టేసింది హీరోయిన్ జాన్వీ కపూర్. ఈ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది.  దావుడి సాంగ్‌ను వావ్ అనిపించేలా కంపోజ్ చేశారు. రామజోగ‌య్య శాస్త్రి తెలుగులో రాసిన ఈ పాట‌ను త‌మిళంలో విఘ్నేష్ శివ‌న్‌, హిందీలో కౌస‌ర్ మునీర్, క‌న్న‌డ‌లో వ‌ర‌ద‌రాజ్ చిక్‌బ‌ల్లాపుర‌, మ‌ల‌యాళంలో మాన్‌కొంబు గోపాల‌కృష్ణ రాశారు. ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ

 భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు. ఇదిలవుండగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న జాన్వీకపూర్‌ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. బీటౌన్‌ సర్కిల్‌ టాక్ ప్రకారం జాన్వీకపూర్ ఈ సారి సిద్దార్థ్‌ మల్హోత్రాతో రొమాన్స్ చేయబోతుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని దినేశ్ జైన్ తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రం అర్బన్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో బోల్డ్‌ కథాంశంతో రాబోతుందట. ఇప్పటికే హిందీలో సన్నీ సంస్కారీ కీ తులసీకుమారి సినిమాలో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: