రామ్ చరణ్ అభిమానుల అసహనం !
అయితే లీకులు మాత్రమే కాకుండా డిసెంబర్ లో ఫలానా తేదీన విడుదల అవుతుంది అన్న క్లారిటీ ఇప్పటికీ కూడ నిర్మాతలా నుండి రాకపోవడంతో చరణ్ అభిమానులు తీవ్ర నీరుత్సాహంలో ఉన్నారు. దీనితో ఈ మూవీ నిర్మాత దిల్ రాజ్ పై ఒత్తిడి పెంచుతూ చరణ్ అభిమానులు వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరుతో రాబోతున్న వినాయకచవితి రోజున ఈమూవీకి సంబంధించి ఏదో ఒక అధికారిక ప్రకటన వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
తమ అసహనాన్ని ఈమూవీ నిర్మాతలను దర్శకుడు శంకర్ ను మరీ ముఖ్యంగా రామ్ చరణ్ ను టార్గెట్ చేస్తూ కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ మూవీ ప్రమోషన్ ను మరింత వేగవంతం చేసి ఈ సినిమాను ప్రేక్షకులు చూసేలా ఈ మూవీ ట్రైలర్ ను కూడ త్వరలో విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది.
అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల విషయంలో దర్శకుడు శంకర్ తన మాట తప్పుతాడేమో అన్న భయంతో రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ మూవీ నిర్మాతల పై ఒత్తిడి పెంచేలా మెగా ఫాన్స్ నెగిటివ్ ట్రెండింగ్ మొదలుపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజుతో పాటు రామ్ చరణ్ తమన్ తదితరులను ట్యాగ్ చేస్తూ దర్శకుడు శంకర్ ని లక్ష్యంగా చేసుకుని వేల సంఖ్యలో ట్వీట్ లు పెడుతూ హడావిడి చేయడంతో కొన్ని నిముషాల వ్యవధిలో ఈవిషయం ట్రెండింగ్ గా మారింది..