టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన ఎడిటర్లలో మార్తాండ్ కే వెంకటేష్ ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలకు ఎడిటర్ గా పని చేశాడు. ఈయన ఎడిటర్ గా పని చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడంతో చాలా కాలం పాటు ఈయన తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన ఎడిటర్ గా కెరియర్ను కొనసాగించాడు. ఇకపోతే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందరూ భాగంగా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా మార్తాండ్ కే వెంకటేష్ మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అనేక సినిమాలకు నేను ఎడిటర్ గా పని చేశాను.
ఆయన హీరోగా నటించిన సినిమాలకు సంబంధించిన ఎడిటింగ్ పనులు జరుగుతున్నప్పుడు ఆయన దగ్గరుండి వాటిని చూసుకునేవాడు. కానీ మధ్యలో జోక్యం చేసుకునేవాడు కాదు. చెప్పింది వింటూ వెళ్లేవాడు. ఆయన నాతో ఎంతో క్లోజ్ గా ఉండేవాడు. ఆయన సినిమా ఎడిటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్నో రోజులు నాతో పాటు ఆయన ఉన్న కూడా ఎప్పుడూ వేరే సినిమా ఎలా ఉంది. వేరే వాళ్ళ సినిమా పనులు ఎలా జరుగుతున్నాయి. ఆ సినిమా బాగుందా ... లేదా ... ఇలాంటి చర్చ ఎప్పుడూ పెట్టేవాడు కాదు. కేవలం తన సినిమా గురించి మాత్రమే ఆలోచించేవాడు.
తన సినిమా ఎలా ఉంటే బాగుంటుంది. తన సినిమా ఎలా ఉంటే జనాలకు నచ్చుతుంది అనే విషయాలపై మాత్రమే ఆయన ఫోకస్ పెట్టేవాడు అని చెప్పాడు. ఆఖరుగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గుడుంబా శంకర్ మూవీ కి ఎడిటర్ గా పని చేశాను. ఆ సినిమా చూసినప్పుడు నేను ఈ మూవీ ఆడది సార్ ... ఇది గొప్పగా లేదు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకోదు అని చెప్పాను అని మార్తాండ్ కే వెంకటేష్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.