తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో రాజమౌళి ప్రధమ స్థానంలో ఉంటాడు అని చెప్పడంలో ఏ మాత్రం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి ఇప్పటికీ అనేక సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ కాలేదు. కనీసం యావరేజ్ విజయాన్ని కూడా అందుకోలేదు. ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈయన సక్సెస్ రేట్ ఎంత గొప్పగా ఉందో సినిమాలు చేయడంలో చాలా సమయాన్ని తీసుకుంటాడు అనే నెగటివ్ టాక్ కూడా రాజమౌళి పై ఉంది.
కానీ సమయం ఎక్కువ తీసుకున్న అవుట్ ఫుట్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈయనకు ఆ మైనస్ కూడా ప్లేస్ గానే మారిపోయింది. ఇక రాజమౌళితో ఏ హీరోతో అయినా సినిమా స్టార్ట్ చేశాడు అంటే అతను దాదాపు రెండు , మూడు సంవత్సరాలు సినిమాలకు దూరంగానే ఉంటాడు. దానితో ఆయన అభిమానులు రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడుతో తమ హీరో సినిమా చేస్తున్నాడు అని ఆనంద పడుతూ ఉన్న మరో వైపు అంతా కాలం మా హీరోని వెండి తెరపై చూడకుండా ఉండడమా అనే నిరాశను కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు.
ఇక మహేష్ మాత్రం రాజమౌళి తో సినిమా చేస్తున్న తన అభిమానులను ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఒక పెద్ద ప్లానింగ్ వేసినట్లు తెలుస్తోంది. రాజమౌళి తో సినిమా చేస్తున్న సమయంలో మహేష్ తాను గతంలో నటించిన కొన్ని సినిమాలను ఎప్పటికప్పుడు రీ రిలీజ్ చేస్తూ ఉండాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలా తన అభిమానులను ఆనంద పెట్టాడానికి మహేష్ అద్భుతమైన ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే రాజమౌళి , మహేష్ కాంబోలో రూపొందబోయే సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి.