విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు నటుడు సుహాస్. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ ‘జనక అయితే గనక’. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌రెడ్డి, హన్షిత లు నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూరైంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రావాలి. అయితే.. ఈ మూవీ ఫైనల్ వైర్షన్‌ను చూసిన తరువాత సుహాస్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. యూఎస్‌లో ఈ చిత్రాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఈ మూవీ యూఎస్ఏ
హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఇందులో సంకీర్తన విపిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, విజయ్ బుల్గనిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, గోపరాజు రమణ లు కీలక పాత్రలను పోషించారు. అయితే సెప్టెంబర్ 7న దీనిని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ సినిమా వాయిదా పడింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ''ఇప్పుడు వర్షాల మోత.. తర్వాత నవ్వుల మోతతో
కలుద్దాం..!! వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితుల రీత్యా మా చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం. నవ్వుల వినోదంతో త్వరలో కలుద్దాం'' అని టీమ్ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న జీవన స్థితిగతుల రీత్యా పిల్లలు కనడానికి భయపడే ఒక వ్యక్తి కథే ఈ సినిమా అని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు సుహాస్ తీసుకున్నారు. తన సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే తాను డిస్ట్రిబ్యూటర్‌గా తొలి అడుగువేస్తున్నానని ఆయన ఇటీవల ప్రెస్‌మీట్‌లో చెప్పారు...!!