బిగ్‌బాస్ 8 సీజన్లో నాగార్జున కోడలు సందడి..?
మిగతా కంటెస్టెంట్స్ ఎవరికీ తెలియకపోయినా హౌస్ లో యాక్టివ్ గానే ఉంటున్నారు. బాగా గొడవలు పెట్టుకుంటున్నారు. చాలా పోటీ తత్వంతో ఆడుతూ ఆటను రక్తి కట్టిస్తున్నారు. నామినేషన్స్ కూడా యుద్ధాన్ని తలపించాయి. కంటెస్టెంట్స్ ఇష్టం వచ్చినట్లు అరుసుకుంటూ గొడవలు పెట్టుకుంటూ బిగ్ బాస్ హౌస్ లో పెద్ద రచ్చ చేశారు. ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ సంగతి అటు ఉంచితే బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. నిజానికి ఇది అఫీషియల్ అప్డేట్ ఏం కాదు కానీ సోషల్ మీడియాలో దీని గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది.
అదేంటంటే కాబోయే దంపతులు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జంటగా బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నారట. చైతు సమంత నుంచి విడిపోయిన కొంతకాలానికి శోభితతో అఫైర్ పెట్టుకున్నాడు. ఇద్దరి ప్రేమ కొంతకాలంలోనే గాఢంగా తయారయింది. దాంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. మామూలు ప్రతి వీకెండ్ ఎపిసోడ్‌కి సినీ సెలబ్రిటీలు బీబీ హౌస్ కు వచ్చి వినోదాన్ని పెంచేస్తారు. కంటెస్టెంట్స్ తో కలిసి బాగా ఎంటర్టైన్మెంట్ పంచుతారు. నాగా చైతన్య, శోభిత కూడా అలానే బిగ్ బాస్ హౌస్ లోకి అతిథులుగా వెళ్లి సందడి చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
నాగ చైతన్య, శోభితల బిగ్‌బాస్ లో త్వరలోనే కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. మేకర్స్ ఆల్రెడీ ఓ స్పెషల్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారని కూడా తెలుస్తోంది. వినాయక చవితి పండుగ రోజున వీళ్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఎంజాయ్ చేస్తారని టాక్. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.