అప్పుడు 'దసరా'కి..ఇప్పుడు 'సరిపోదా'కు.. పాపం నాని?

praveen
తెలుగు సినీ ప్రేక్షకులందరికీ కూడా నాచురల్ స్టార్ గా కొనసాగుతున్న నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.దసరా అనే మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాని ఆ తర్వాత హాయ్ నాన్న అనే మూవీతో అభిమానులను పలకరించాడు. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు అన్న విషయం తెలిసిందే. కేవలం యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది. ఇటీవల  సరిపోదా శనివారం అనే మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

 ప్రేక్షకులు అందరిని కూడా థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వసూళ్ల పరంగా పరవాలేదు అనిపిస్తుంది. కానీ ఇక ఇప్పుడూ నాని సరిపోద శనివారం సినిమా విషయంలో గతంలో దసరా సినిమాకు జరిగినట్లుగానే జరిగింది అన్నది తెలుస్తుంది. గతంలో దసరా మూవీ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ ఏపీలో మాత్రం అనుకున్నంత ఆడలేదు. తెలంగాణ యాస కల్చర్ బాగా దట్టించడం వల్లేనేమో అని అందరూ అనుకున్నారు. దీంతో 100 కోట్ల గ్రాస్ సాధించిన దసరా మూవీకి అటు ఏపీలోని కొన్ని ఏరియాలలో మాత్రం నష్టాలు తప్పలేదు.

 నైజం లో మాత్రం దసరా బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఇక ఇప్పుడు సరిపోదా శనివారం పరిస్థితి కూడా ఇలాగే ఉంది అన్నది తెలుస్తోంది. ఇందులో కల్చర్ లాంటి అంశాలు సినిమాను ప్రభావితం చేసేలా లేవు. సరిపోదా శనివారం మంచి టైం తోనే రిలీజ్ అయింది. టాక్ రివ్యూలు కూడా డీసెంట్ గానే వచ్చాయి. మంచి మూవీ కోసం  ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయంలో సరిపోదా శనివారం థియేటర్లలోకి వచ్చింది. కానీ వర్షాలు ఈ సినిమాను పెద్ద దెబ్బకొట్టాయ్. నైజాంకు కేంద్ర స్థానమైన హైదరాబాద్ లో వర్షం పడ్డ మరి ఇబ్బందికరంగా ఏమీ లేదు. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి ఆశాజనకంగా లేదు. వర్షాలు వల్ల విజయవాడ గుంటూరు సహా పలు ప్రాంతాలు వరదల గుప్పిట్లోకి వెళ్లాయి. ఇలాంటి పరిస్థితి సరిపోదా శనివారం వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుంది. అక్కడ బ్రేక్ ఈవెన్ మార్కులో సగం కంటే కాస్త ఎక్కువగా వసూళ్లు వచ్చాయి. అంటే ఇంకో 40 నుంచి 45 శాతం రికవరీ అవ్వాల్సి ఉందట. దీంతో గతంలో దసరా సినిమాకు జరిగినట్లుగానే ఇక ఇప్పుడు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో సరిపోదా శనివారంకి కూడా అలాగే జరుగుతుందని.. నాని మంచి సినిమాలు తీసిన ఇలా ఏదో ఒక విధంగా వసూళ్లు తక్కువగా వస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: