అక్కినేని నాగేశ్వర రావు మనువడిగా ,అక్కినేని నాగార్జున తనయుడిగా అందరికి సుపరిచితుడే హీరో అఖిల్. తన మొదటి సినిమా అఖిల్ డిజాస్టర్ తరువాత ఈ హీరోకి సక్సెస్ తెచ్చి పెట్టిన సినిమాలు ఏవీ లేవు. మోస్ట ఎలిజబుల్ బ్యాచులర్ చిత్రం ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది. తరువాత ఆయన తదుపరి చిత్రం ఏజెంట్ తో అతి పెద్ద పరాజయం చవిచూశాడు. ఏజెంట్ సినిమా కోసం ఎంత కష్టపడినా కథలో విషయం లేకపోవడంతో నెగెటివ్ రిజల్ట్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. గతేడాది ఏజెంట్ డిజాస్టర్ తరువాత అఖిల్ ఏ సినిమా మొదలు పెట్టలేదు. అయితే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ లాంటి ఫ్యామిలి ఎంటర్ టైనర్
తరహాలోనే సినిమాలు ఎంపిక చేసుకోని ఉంటే అఖిల్ కెరీర్ ట్రాక్ లో పడేది. చాలా కాలం నుండి అఖిల్ మంచి కథ కోసం వేచి చూస్తున్నాడు. ఇదిలా ఉంటే వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళీకృష్ణ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక కథ చెప్పాడంట. ఈ స్టోరీ నాగార్జున, అమల, సుప్రియకి బాగా నచ్చిందంట. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారని టాక్. లెనిన్ టైటిల్ తో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందంట. అయితే ఇప్పుడు ఈ సినిమాని కంప్లీట్ చేయాలనే నిర్ణయానికి అఖిల్ వచ్చారంట. అలా అయితే ఇన్ని రోజులు ధీర సినిమా కోసం అఖిల్ పెంచిన గెడ్డం పరిస్థితి
ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒక వేళ లెనిన్ సినిమాలోని క్యారెక్టర్ ని గెడ్డంతో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా లేదంటే కొత్త లుక్ ని ట్రై చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా అఖిల్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అక్కినేని ఫ్యాన్స్ కూడా అఖిల్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారని టాక్. లెనిన్ టైటిల్ తో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందంట. అయితే ఇప్పుడు ఈ సినిమాని కంప్లీట్ చేయాలనే నిర్ణయానికి అఖిల్ వచ్చారంట...!!