ఆ ఫ్లాప్ మూవీ నుండి ఎస్కేప్ అయిన రష్మిక.. బుక్కయిన పూజా హెగ్డే..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో ఒకరితో అనుకున్న పాత్రను మరొకరితో తెరకెక్కించడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒక పాత్రలో ఒకరిని అనుకున్న తర్వాత అందులో వేరే వాళ్ళు నటించినట్లు అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న లేక ఆ పాత్రకు అద్భుతమైన గుర్తింపు వచ్చిన మిస్ చేసుకున్న వారు ఆ సినిమాను చేసి ఉంటే బాగుండుంది అనుకుంటారు. ఇక అదే సినిమా ఫ్లాప్ అయిన ఆ మూవీ లోని ఆ పాత్రకు పెద్దగా గుర్తింపు రాకపోయినా ఆ రోజు ఆ మూవీ ని రిజెక్ట్ చేసి చాలా మంచి పని చేసాం అనుకుంటూ ఉంటారు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటి మనులలో రష్మిక మందన , పూజా హెగ్డే ఉంటారు.

కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఒక సినిమా ఆఫర్ మొదటగా రష్మిక మందన కు రాగా , దానిని ఆమె రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆ సినిమాను పూజ హెగ్డే ఓకే చేసింది. దాని ద్వారా ఆమెకు ఫ్లాప్ వచ్చింది. ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం. కొంత కాలం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడిగా పూజ హెగ్డే నటించింది. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా మొదట పూజా హెగ్డే ను కాకుండా రష్మిక మందన ను అనుకున్నారట. అందులో భాగంగా ఈమెకు కథను కూడా వివరించగా ఆ సమయంలో వేరే సినిమాతో బిజీగా ఉండడంతో ఈ బ్యూటీ నేను చేయలేను అని చెప్పిందట. దానితో పూజా హెగ్డే ఈ కథను చెప్పగా ఆమె ఓకే చేసిందట. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలా ఆచార్య మూవీ నుండి రష్మిక తప్పించుకుంటే పూజా హెగ్డే మాత్రం ఈ సినిమా చేసి అపజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: