మూవీ థియేటర్స్:అప్పుడు జగన్ చేసింది.. ఇప్పుడు డిప్యూటీ సీఎం చేస్తున్నారా..?

Divya
సినిమా టికెట్ల రేట్లు భారీగా పెరగడంతో సామాన్య ప్రేక్షకులు రాను రాను థియేటర్లకు రావడం దూరమయ్యారు. అయినా కూడా భారీ చిత్రంలో కోసం ఎవరో ఒకరు వస్తారని వందల కొద్ది రేట్లు పెంచుతూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వంతో మాట్లాడి సినిమా టికెట్ల రేటును పెంచుకోవడమే కాకుండా అదనపు షోలు కూడా వేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో టికెట్లు రేట్లు కాస్త అడ్డుకట్టు వేసిన రీజనబుల్ గా పెంచారు తప్ప అతిగా పెంచలేదు..అలాంటి సమయంలో ప్రభుత్వం మారిపోయింది కానీ ఇప్పుడు తమకు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేస్తారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

అందుకు ఉదాహరణగా కల్కి సినిమా టికెట్ల రేట్లు చూసి చాలామంది సామాన్య ప్రజలు కూడా భయపడుతున్నారు.. కానీ నిర్మాతలు మాత్రం కాస్త ఆనందంగా ఉన్నారట. కొన్ని ప్రాంతాలలో సుమారుగా ఒక్కో టికెట్ 400 రూపాయల వరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అయితే ఇలా టికెట్లు రేట్లు పెంచడం వెనక ప్రభుత్వం ఫీడ్ బ్యాక్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అలా ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత  ఇకమీదట రూ .50 నుంచి రూ .75 రూపాయలకు మించి ఎక్కడా కూడా అదనంగా టికెట్లు రేట్లు పెంచకూడదని ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉత్తర్వులను కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సింగిల్ స్క్రీన్ కు 50 రూపాయలు మల్టీప్లెక్స్ లకు కేవలం 75 రూపాయలు మాత్రమే ఇచ్చేలా చూస్తున్నారట. ఈ విషయంలో సినిమా రంగంలోకి సంబంధం ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్థిర నిర్ణయంతో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని తెలిపారు.. అదనపు రేట్లు ఎవరు అడిగినా కూడా ఇవ్వకూడదని 50-75 రూపాయలు మాత్రమే మించి ఇవ్వకూడదని సూచించారట. అది తన సినిమా అయినా సరే ఇతరుల సినిమా అయినా సరే ఇక మీదట సామాన్యుల మీద భారం వేయకూడదని సూచించారట. గడిచిన కొన్ని నెలల క్రితం సినిమా పెద్దలు పవన్ కళ్యాణ్ ని కలిసినప్పుడు సినిమా టికెట్లు రేటు విషయంపై ఒక పాలసీ ఉండాలని సూచించారు. త్వరలోనే ఇది అమలు కాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: