హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్‌తో 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలైనా మధ్యలో కొన్ని అనుకోని బ్రేకులు వచ్చాయి. ఇలా ఇన్ని రోజుల వ్యవధిలో కేవలం 70 శాతం వరకూ మాత్రమే షూటింగ్ పెద్ద పెద్ద స్టార్లు కలిసి చేస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్‌ను ఆ మధ్య పున: ప్రారంభించారు. అలా కొన్ని షెడ్యూళ్లను కూడా చేసుకుంటూ వచ్చారు. అంతలోనే మళ్లీ బ్రేక్ వేసేశారు. ఈ క్రమంలోనే తాజాగా దీన్ని మొదలు పెట్టి.. ఇక ఏమాత్రం బ్రేకులు లేకుండా జరిపేలా ప్లాన్
చేస్తున్నారు. ఇలా ఈ ఏడాది చివరి నాటికి దీన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. భారతీయుడు 2 సినిమా ఫ్లాప్ అవడంతో శంకర్ కి మార్కెట్ పరంగా భారీగా దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి. కానీ రామ్ చరణ్ సినిమా కావడం వల్ల ఈ సినిమాకి మార్కెట్ పరంగా అయితే పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చు. రామ్ చరణ్ ఈ సినిమాతో వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లు రాబడటమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా దాదాపు 500 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా రామ్ చరణ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడం కూడా విశేషం…ఇక మొన్నటి దాకా భారతీయుడు 2
సినిమా వల్ల డిలే అవుతూ వచ్చిన ఈ ప్రాజెక్టు చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యం లో శంకర్ ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ కి రెడీ అవ్వబోతుంది అంటూ మేకర్స్ అయితే కొన్ని హింట్లైతే ఇస్తున్నారు. కానీ అఫీషియల్ గా ఇంకా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ అయితే ఇవ్వడం లేదు. ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు కూడా ఈ సినిమా ప్రస్థవన వచ్చిన ప్రతిసారి దాటవేస్తున్నాడు. కానీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేకపోతున్నాడు...!!