బడ్జెట్ రూ.45 కోట్లు.. వసూళ్లు రూ.45 వేలే.. ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్?

praveen
ఈ మధ్యకాలంలో అన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ఇలాంటి సినిమాల్లో కొన్ని హిట్ అయ్యి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెడుతుంటే ఇంకొన్ని మాత్రం ఫ్లాప్లుగానే మిగిలిపోతూ ఉన్నాయి. అయితే ఫ్లాప్ సినిమా అంటే ఇక పెట్టిన బడ్జెట్ కంటే తక్కువ వసూళ్లు రావడం. ఈ మధ్యకాలంలో పెట్టిన బడ్జెట్ వచ్చిన కూడా లాభాలు రాకపోవడంతో.. ఆ సినిమాను ఫ్లాప్ సినిమా గానే పరిగణిస్తున్నారు.

 దాదాపుగా ఏ సినిమాకు అయినా సరే పెట్టిన బడ్జెట్లో కనీసం సగమైన వసూళ్ల ద్వారా వస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో డిజిటల్ స్ట్రీమింగ్ కారణంగా మిగతా సగం కూడా రాబట్టుకుంటున్నారు నిర్మాతలు. కానీ ఇక్కడ ఒక సినిమా మాత్రం ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్. ఏకంగా 45 కోట్ల బడ్జెట్తో ఆ మూవీ తెరకెక్కింది. కానీ వసూలు చేసింది మాత్రం కేవలం 45 వేల రూపాయలు మాత్రమే. వినడానికే ఆశ్చర్యకరంగా ఉంది కదా. కానీ ఓ సినిమా విషయంలో ఇది నిజంగానే జరిగింది. ఆ సినిమా పేరు ది లేడీ కిల్లర్.

 అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్ జంటగా నటించిన ఈ మూవీ మొదలైన ఎన్నో ఏళ్ల తర్వాత అది కూడా సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకు అర్జున్ కపూర్,భూమి పడ్ణేకర్ ప్రమోషన్స్ చేయలేము అని చెప్పడంతో చివరికి నిర్మాతలు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే సినిమాను విడుదల చేయగా.. సినిమా వచ్చిన విషయం కూడా ఎవరికీ తెలియదు. దీంతో 12 షోలు మాత్రమే వేశారు. తొలి రోజు 38000 వసూళ్లు రాగ.. ఇక మొత్తంగా 45000 మాత్రమే వసూల్ అయ్యాయి. ఇలా 45 కోట్ల బడ్జెట్తో తెరకేక్కిన ఈ మూవీ 45000 మాత్రమే వసూలు చేసింది. అయితే ఈ మూవీకి మొత్తం కలిపి 293 టికెట్లు మాత్రమే అమ్ముడు అయ్యాయి అంటే ఈ సినిమా దుస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మూవీ ఇప్పటివరకు ఓటీటి స్ట్రీమింగ్ కి నోచుకోకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: