కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ శాతం పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలు వస్తూ ఉండేవి. ఇక అలాంటి సినిమాలే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధిస్తూ ఉండేవి. భారీ కలెక్షన్లు అలాంటి మూవీ లకే వస్తూ ఉండేవి. దానితో స్టార్ హీరోలు , స్టార్ దర్శకులు కూడా ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలు తీయడానికి ఇష్ట పడేవారు. ప్రస్తుతం మాత్రం పరిస్థితులు చాలా వరకు మారాయి. తెలుగు సినీ పరిశ్రమంలోని దర్శకులు కానీ , హీరోలు కానీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లను రొటీన్ గా తేరకేక్కించినట్లు అయితే అలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజ్యాలను అందుకుంటున్నాయి.
మరి ముఖ్యంగా ఒక పది సంవత్సరాల క్రితం కమర్షియల్ సినిమాలను తీసిన మాదిరి గానే ఇప్పుడు సినిమాలను తీసి విడుదల చేస్తే మాత్రం ఆ సినిమాలు దాదాపుగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. కమర్షియల్ సినిమాలు తీసిన కనీసం స్క్రీన్ ప్లే అయిన కొత్తగా ఉంటేనే ఆ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. లేకుండా రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే అలాంటి సినిమాలు కనీసం యావరేజ్ విజయాలను కూడా అందుకోవడం లేదు.
దానితో చాలా మంది కొత్త దర్శకులు ఈ మధ్య కాలంలో సీనియర్ స్టార్ దర్శకుల కంటే ఎక్కువగా తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ అవుతున్నారు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం కమర్షియల్ సినిమాలతో అద్భుతమైన స్థాయికి ఎదిగిన పూరి జగన్నాథ్ , శ్రీను వైట్ల , హరీష్ శంకర్ , శ్రీను వైట్ల మరి కొంత మంది దర్శకులు కూడా తమ రూట్ మార్చి వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించాల్సిన అవసరం వచ్చింది. వారు ఈ మధ్య కాలంలో తెరకెక్కించిన కమర్షియల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో సక్సెస్ కాలేదు.