నిన్న అనగా సెప్టెంబర్ 1 వ తేదీన నందమూరి బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భారీ ఎత్తున ఓ ఈవెంట్ ను నిర్వహించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ ఈవెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలు అయినటు వంటి మెగాస్టార్ చిరంజీవి , విక్టరీ వెంకటేష్ లతో పాటు అనేక మంది కుర్ర హీరోలు కూడా ముఖ్య అతిథులుగా విచ్చేశారు . ఈ ఈవెంట్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ... బాలకృష్ణ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఇకపోతే చిరంజీవి ఈ ఈవెంట్ లో బాగంగా మాట్లాడుతూ ... నేను ఇంద్ర సినిమా చేశాను.
అది బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఇక నేను ఆ సినిమా చేయడానికి ఆదర్శం బాలకృష్ణ హీరోగా రూపొందిన సమరసింహా రెడ్డి. సమరసింహా రెడ్డి చూసిన తర్వాతే ఫ్యాక్షన్ సినిమా చేయాలి అని నాకు అనిపించింది అని చిరంజీవి తాజా ఈవెంట్ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే బాలకృష్ణ హీరోగా రూపొందిన సమరసింహా రెడ్డి మూవీ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను వసూలు చేయడం మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది.
ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర సినిమా కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి అప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా రాబట్టని వసూళ్లను రాబట్టి టాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో రూపొందిన సమారసింహా రెడ్డి , ఇంద్ర ఈ రెండు మూవీ లు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి.