HBD Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంతలా ఎదగడం వెనుక ఉంది ఆమెనా..?
1971 సెప్టెంబర్ 2న బాపట్ల పవన్ కళ్యాణ్ జన్మించారు. కొణిదెల వెంకటరావు అంజనదేవులకు జన్మించారు.. పవన్ కళ్యాణ్ కు ఇద్దరు అక్కలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కేవలం పదవ తరగతి మాత్రమే చదివారు పై చదువులు చదవడం ఇష్టం లేక ఒంటరితనానికి అలవాటు పడిపోయారట.. ఈ విషయాన్ని గుర్తించిన చిరంజీవి భార్య సురేఖ చిరంజీవితో చర్చించి పవన్ కళ్యాణ్ ను ఇండస్ట్రీలోకి తీసుకురావాలని సూచించిందట.
అలా పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేకపోయినా తన వదిన సురేఖ పట్టుదలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తానే స్వయంగానే వెల్లడించారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో తనకు ఒక బ్రాండ్ ఏర్పడాలని పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నారట. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా మారారు.
పవన్ కళ్యాణ్ రేంజ్ ను మార్చిన చిత్రాలలో సుస్వాగతం తమ్ముడు, బద్రి, తొలిప్రేమ, ఖుషీ, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి చిత్రాలు ఉన్నాయి. అభిమానులను విపరీతంగా ఈ సినిమాలు ఆకట్టుకున్నాయి.
కొన్నేళ్లు సినిమాలకు రాజకీయాల పరంగా గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకుంటూ పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG కంటి చిత్రాల నటిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తన సినీ కెరియర్లు ఎన్నో కార్డులు అవార్డులు కూడా అందుకున్నప్పటికీ.. తన కెరియర్ లో డ్యాన్స్ మాస్టర్ గా ,సింగర్ గా, డైరెక్టర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా కూడా వ్యవహరించి అరుదైన రికార్డును సంపాదించుకున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఇంతలా పాపులర్ కావడం వెనుక ఆ రోజు పవన్ కళ్యాణ్ వదిన సురేఖ తీసుకుని నిర్ణయమే అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఎన్నో సందర్భాలలో పవన్ కళ్యాణ్ కు ధైర్యం చెబుతూ అటు చిరంజీవి ఆయన భార్య సురేఖ ఇద్దరు కూడా సపోర్టు చేసేవారట. అందుకే పవన్ కళ్యాణ్ స్టార్డం వచ్చినా కూడా వారిని ఎప్పుడూ మరువలేదు.