ఎవరు టచ్ చేయని రికార్డును.. మళ్లీ కొట్టేసిన నాని?

praveen
డాక్టర్ అవ్వాల్సిన వాడు యాక్టర్ అయ్యాడు అని సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అయితే నాచురల్ స్టార్ నాని విషయంలో కూడా ఇదే సామెత వర్తిస్తుంది. డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన నాని చివరికి హీరోగా సెటిల్ అయిపోయాడు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తన నటనతో నాచురల్ స్టార్ దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ఒకటిగా కొనసాగుతూ ఉన్నాడు నాని.

 హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ వున్నాడు అనే విషయం తెలిసిందే. దసరా అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన నాని.. ఆ తర్వాత హాయ్ నాన్న అనే మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే డిఫరెంట్ సినిమాలను తీసి తన డైరెక్షన్ తో ప్రేక్షకులను మెప్పించిన వివేక్ ఆత్రేయతో.. నాని ఇటీవల సరిపోదా శనివారం అనే సినిమా తీశాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అంటే సుందరానికి అనే మూవీ వచ్చింది.

 ఇక ఇటీవలే విడుదలైన సరిపోద శనివారం మూవీ మొదటి రోజు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటూ భారీగా వసూళ్లు సాధిస్తుంది. ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ వసూలు అదరగొడుతున్నాయి. ఓవర్సీస్ లో సరిపోదా శనివారం మూవీ వన్ మిలియన్ డాలర్లు కొట్టేసింది. రిలీజ్ అయిన రెండు రోజులకే ఈ ఫీట్ సాధించడం విశేషం. అయితే నాని కెరియర్ లో వన్ మిలియన్ డాలర్లు వసూలు చేసిన సినిమాల్లో సరిపోదా శనివారం మూవీ పదో మూవీ కావడం గమనార్హం. అయితే ఇది ఎవరు టచ్ చేయలేని రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ఓవర్సీస్ లో అత్యధిక సినిమాలతో వన్ మిలియన్ డాలర్స్ వసూలు చేసిన స్టార్స్ లో ఒక సూపర్ స్టార్ మాత్రమే టాప్ లో ఉన్నాడు. మహేష్ బాబు నటించిన 11 సినిమాలు అక్కడ పని మిలియన్ డాలర్ మార్క్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు నాని 10 సినిమాలతో  ఈ రికార్డు అందుకొని రెండో స్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: