తెలుగులో ఫ్లాప్.. కానీ డబ్ చేస్తే.. అక్కడ సిల్వర్ జూబ్లీ?

praveen
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే.  పుష్ప బ్లాక్బస్టర్ హిట్ తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. అయితే అల్లు అర్జున్ అభిమానులు అటు మల్లు అర్జున్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన నటించిన సినిమాలు తెలుగులో ఎంతలా అయితే హిట్ అవుతూ ఉంటాయో.. ఇక మలయాళం లో కూడా అదే రేంజ్ లో హిట్ అవుతూ భారీ వసూళ్లు సాధిస్తూ ఉంటాయి. అక్కడ అల్లు అర్జున్ అభిమానించే ప్రేక్షకులు కోట్లలోనే ఉన్నారు అని చెప్పారు

 అటు హీరో అల్లు అర్జున్కి కూడా మలయాళ ఇండస్ట్రీ అన్న, కేరళ అన్న ప్రత్యేకమైన అభిమానం. చాలాసార్లు సినిమా ఈవెంట్లలో ఈ విషయాన్ని చెప్పాడు కూడా. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బన్నీ నటించిన ఒక మూవీ తెలుగులో ఫ్లాప్ అయినప్పటికీ అటు మలయాళం లో మాత్రం సూపర్ హిట్ అయిందట. ఏకంగా సిల్వర్ జూబ్లీ ని కూడా కంప్లీట్ చేసుకుందట. ఆ సినిమా ఏదో కాదు హ్యాపీ. కరుణాకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కెరీర్ లో నాలుగో మూవీగా తెరకెక్కింది హ్యాపీ.

 ఈ సినిమాలో తనకంటే సీనియర్ అయినా జెనీలియాతో కలిసి యాక్ట్ చేశాడు అల్లు అర్జున్. తెలుగులో ఈ మూవీ యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కి తెలుగు జనాలు కనెక్ట్ కాలేదు. దీంతో ఇక్కడ వంద రోజులు ఆడినప్పటికీ.. ఈ సినిమాకు పెద్దగా లాభాలు మాత్రం రాలేదు. అయితే హ్యాపీ బీ హ్యాపీ పేరుతో మలయాళంలో ఈ సినిమాను డబ్ చేశారు. అక్కడ మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. 175 రోజులు ఆడి సిల్వర్ జూబ్లీని సొంతం చేసుకుంది. అక్కడ జనాలకు ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అయిపోయాయి. ఇక ఆ తర్వాత వచ్చిన దేశముదురు, పరుగు సినిమాలతో కూడా అక్కడ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: