నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఆగస్టు 29 వ తేదీన థియేటర్లో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్లు ఆగస్టు 24 వ తేదీనే ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ టికెట్స్ కి బుక్ మై షో లో ఆగస్టు 24 వ తేదీ నుండి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఆగస్టు 24 వ తేదీ నుండి 29 వ తేదీ వరకు ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు రోజు వారిగా ఎన్ని బుక్ మీ షో ఆప్ లో అమ్ముడు పోయాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ఆగస్టు 24 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 12.68 కే టికెట్లు బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి.
ఆగస్టు 25 వ తేదీన 16.49 కే టికెట్లు సేల్ అయ్యాయి.
ఆగస్టు 26 వ తేదీన 19.01 కే టికెట్లు సేల్ అయ్యాయి.
ఆగస్టు 27 వ తేదీన 31.56 కే టికెట్లు సేల్ అయ్యాయి.
ఆగస్టు 28 వ తేదీన దాదాపుగా 90 కే టికెట్లు సేల్ అయ్యాయి.
ఆగస్టు 29 వ తేదీన 191.44 కే టికెట్లు సేల్ అయ్యాయి.
ఇలా బుక్ మై షో ఆప్ లో సరిపోదా శనివారం సినిమాకు సంబంధించిన టికెట్లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇకపోతే ఈ మూవీ కి జాక్స్ బిజయ్ సంగీతం అందించగా ... ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.