నిద్రపోయే ముందు.. బాలయ్య ప్రతిరోజు ఆ పని చేస్తారట తెలుసా?

praveen
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం అభిమానుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. ఆయా హీరోలకు మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆ హీరో పేరు వినిపించింది అంటే చాలు ప్రేక్షకులకు పూనకాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. అభిమానులు అందరూ ఆయన్ని ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటూ ఉంటారు.

 నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బాలయ్య.. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపును సంపాదించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్రరంగ ప్రవేశం చేసిన బాలయ్య.. ఇక ఇప్పటికీ స్టార్ హీరోగా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవలే బాలయ్య తెలుగు చిత్ర పరిశ్రమలో తన 50 ఏళ్ల స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బాలయ్య గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అయినా డైలీ రొటీన్ ఏంటి? ఇక ఆయన సినిమాల్లోఎంపిక విషయంలో ఎలా ఆలోచిస్తారు.. ఆయన ఫాలో అయ్యే డైట్ ఏంటి ఇలా అన్ని విషయాలు హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.

 అయితే నందమూరి బాలకృష్ణ ప్రతిరోజు నిద్రపోయే ముందు ఓ పనిని తప్పకుండా చేస్తాడట. అదే సినిమాలు చూడటం సినిమాలు అంటే ఏదో ఒక సినిమా చూడటం కాదు. తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ చేసిన మూవీలను తప్పక చూస్తారట బాలయ్య. తన తండ్రి సినిమాలు తప్ప వేరే సినిమాలను అస్సలు చూడరట. అంతేకాదు ప్రతిరోజు ఎన్టీఆర్ సినిమా చూసిన తర్వాతే ఆయన నిద్రపోతూ ఉంటారట. ఇక తండ్రిపై అటు బాలయ్యకు ఎంత అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ తండ్రి జీవనశైలిమే బాలయ్య ఫాలో అవుతూ ఉంటారు. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు అందరూ హీరోలు రీమేక్ సినిమాలు చేసినప్పటికీ ఒక్క బాలయ్య మాత్రం ఇప్పటివరకు తన 50 ఏళ్ల కెరియర్ లో ఒక్కసారి కూడా రిమేక్ సినిమా చేయకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: