నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తన కష్టంతో ఒక్కో విజయాన్ని అందుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు . ఇకపోతే బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి కాబోతోంది . ఈ సందర్భంగా బాలయ్య సినీ పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బాలయ్య సినీ స్వర్ణోత్సవం వేడుకలను అత్యంత గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎంతో మంది ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బాలయ్య సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆయన పేరు మీద ఉన్న కొన్ని రికార్డులు , ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం.
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన హీరోలలో చాలా మంది పక్క భాషలో హిట్ అయిన సినిమాలను తెలుగు భాషలో రీమిక్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ బాలకృష్ణ మాత్రం ఇప్పటివరకు తన కెరీర్లో ఒక్క సినిమాను కూడా రీమిక్ చేయలేదు. ఇక బాలకృష్ణ ఇప్పటివరకు ఏకంగా 17 సినిమాల్లో డ్యూయల్ రోల్ లో నటించాడు. ఇక అధినాయకుడు అనే సినిమాలో ఏకంగా త్రిపాత్రాభినయంలో కూడా నటించాడు. 1987 వ సంవత్సరంలో బాలయ్య నటించిన 8 సినిమాలు విడుదల కాగా , ఆ 8 మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. బాలకృష్ణ కెరియర్ లో 71 సినిమాలు 100 రోజులకు పైగా థియేటర్లలో ఆడాయి. ఇక బాలకృష్ణ తన కెరియర్లో 6 ఫిలిం ఫేర్ అవార్డులను , మూడు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు.