నందమూరి నటసింహం బాలకృష్ణ తాతమ్మ కల సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ఈనెల 30వ తేదీతో 50 సంవత్సరాలు పూర్తిచేసుకోబోతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు సినీ పరిశ్రమ తరఫున ప్రముఖులంతా బాలయ్యకు గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుతున్నారు. సెప్టెంబరు ఒకటోతేదీ సాయంత్రం ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ సందర్భంగా వేడుకలకు హాజరుకావాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డితోపాటు చిరంజీవి, పవన్ కల్యాణ్, అమితాబ్ బచ్చన్ లాంటి వారందరికీ ఆహ్వానం అందింది. ఇక ఈ
విషయం పక్కన పెడితే బాలకృష్ణ కథానాయకుడిగా, డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తాజా అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే 2025 సంక్రాంతి కానుకగా బాలకృష్ణ-బాబీ సినిమా విడుదల కానున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులో ఏ నిజం లేదని తెలుస్తోంది. షూటింగ్ ఇప్పటికే చాలావరకూ పూర్తయిన నేపథ్యంలో ఆలస్యం చేయకుండా.. డిసెంబర్ 2నే సినిమా విడుదల చేయాలని నిర్మాతలు
భావిస్తున్నారట. అఖండ చిత్రం విడుదలైంది కూడా ఇదే రోజు కావడం విశేషం. సెంటిమెంట్‌గా డిసెంబర్ 2 బాగా కలిసొస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఈ చిత్రంలో ఊర్వశీ రౌతేలా, పాయల్ రాజ్‌పుత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ప్రతినాయక పాత్ర చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ మాస్ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు... బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో మెగా కుటుంబంలోని సభ్యులు, అల్లు అరవింద్, అల్లు అర్జున్.. ఇలా ప్రముఖులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. అయితే వేడుకలకు ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులను మాత్రం ఆహ్వానించలేదని వార్తలు వస్తున్నాయి. వారెవరో కాదు.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్. మరి ఈ వార్తల్లో నిజమేన్తుందో తెలియాలి అంటే వీటికి సంబంధించిన వివరాలు వచ్చే వరకూ ఆగాలి..!!