ప్రేమ దాయడమే కష్టం.. తమన్నాతో లవ్ పై విజయ్ కామెంట్?
కానీ కొంతమంది మాత్రం ఎంత రహస్యంగా తమ ప్రేమ విషయాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నించిన.. చివరికి మీడియా కంట పడుతూ అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. అయితే ఇలా సోషల్ మీడియాలో ప్రేమ వ్యవహారం గురించి చర్చ జరుగుతున్న.. ఆయా సెలబ్రిటీలు మాత్రం ఎక్కడా స్పందించకుండా సైలెంట్ గానే ఉంటారు. ఇంకొంతమంది మాత్రం తమ ప్రేమ విషయంపై ఓపెన్ అయిపోతుంటారు అని చెప్పాలి. అయితే టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్న బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ఇలాగే తమ ప్రేమ వ్యవహారంలో త్వరగానే ఓపెన్ అయిపోయారు. వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు అన్న విషయం తెలిసిందే.
అయితే అందరూ సెలబ్రిటీల లాగా తమ ప్రేమ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచలేదు అన్న విషయాన్ని ఇటీవలే విజయ్ వర్మ చెప్పుకొచ్చాడు. తమన్నాతో ఉన్న ప్రేమను దాయడం ఇష్టం లేకనే తక్కువ టైంలో బయటపెట్టినట్లు చెప్పుకొచ్చాడు విజయ్ వర్మ. ఒకరినొకరు ఇష్టపడి సమయాన్ని గడపాలి అని నిర్ణయించుకున్నప్పుడు మా ప్రేమను దాయాల్సిన అవసరం లేదు అని అనిపించింది. ప్రేమను దాయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కలిసి బయటకు పోలేము. అలాంటి ఆంక్షలు నాకు నచ్చవు. తమన్నాతో కలిసి దిగిన 5000 ఫోటోలను ఇప్పటికీ కూడా ఎక్కడా షేర్ చేయలేదు అంటూ విజయ్ వర్మ చెప్పుకొచ్చాడు.