సూపర్ స్టార్ రజనీ, లోకనాయకుడు కమల్ హాసన్ తర్వాత టాలీవుడ్లో ఆ స్థాయి మార్కెట్ ఉన్న నటుడు విజయ్ దళపతి. అంతెందుకు.. ఒక కోలీవుడ్ హీరో సినిమాకు తెలుగులో రూ.20 కోట్ల బిజినెస్ జరగడం అంటే మాములు విషయం కాదు. లియో సినిమాతో అది కూడా జరిగిపోయింది. దసరా బరిలో తెలుగు సినిమాలను నెట్టి మరీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. ఇక తమిళనాట విజయ్కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా రిలీజవుతుందంటే అక్కడ పెద్ద పండగే. ఇక డే1 నుంచి కలెక్షన్ల సునామీ మొదలవుతుంది. ఆయన ఓపెనింగ్స్ రికార్డులను ఆయనే బ్రేక్ చేసుకుంటాడు. ఆ మధ్య ఓ సందర్భంలో దిల్ రాజు
చెప్పినట్లు… విజయ్ సినిమాలు టాక్ తో సంబంధంలేకుండా కోట్లు కొల్లగొడుతుంటాయని చెప్పాడు.దిల్ రాజు చెప్పినట్లే… ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం నిర్మాతలకు ప్రాఫిట్ వెంచర్లా మారిపోతాయి. ఇక దళపతి విజయ్ కు టాలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్న విజయ్ చేసే లాస్ట్ రెండు ప్రాజెక్ట్స్ లో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్) మూవీ మొదటిదిగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. సెప్టెంబరు 5వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. విజయ్ సినిమా విడుదల కావడానికి వారం రోజుల సమయం ఉంది అంటే హడావిడి ఏ రేంజ్ లో
ఉంటుందో అందరికీ తెలుసు. అయితే రొటీన్ కి భిన్నంగా ఈసారి సోషల్ మీడియాలో ఎక్కడ ఫ్యాన్స్ హంగామా కనిపించడం లేదు. గత ఎడాది బాలకృష్ణ, రవితేజ పోటీ తట్టుకొని తెలుగులో లియో చిత్రం నిలబడి కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. దీన్ని బట్టి తెలుగులో విజయ్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. అందుకే అతని కొత్త మూవీ వస్తుంది అంటే తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఎంతో కొంత హడావిడి కనిపిస్తుంది. తెలుగు స్టార్ హీరోల సినిమాల లాగే విజయ్ సినిమాకి కూడా ఇక్కడ థియేటర్ డిస్ట్రిబ్యూషన్ హక్కులకు భారీ డిమాండ్ ఉంది.గోట్ మూవీపై మంచి టాక్ ఉంది.. అని ఎక్కడ కనిపించాల్సిన రేంజ్ లో బజ్ మాత్రం కనిపించడం లేదు...!!