ఏదైనా సినిమా విడుదల అయింది అంటే ఆ సినిమాకు కాస్త టాక్ అటూ ఇటూ వచ్చిన మొదటి మూడు రోజులు మూవీలకు మంచి కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ఆ తరువాత సినిమా కలెక్షన్లు పడిపోయినా కూడా నిర్మాతలు అంతో ఇంతో డబ్బులను వెనకేసుకొనే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో వారికి ఆ అవకాశం కూడా పెద్దగా దొరకడం లేదు.అసలు విషయం లోకి వెళితే ... రీసెంట్ టైమ్ లో ఎక్కువ శాతం స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలు రీ రిలీస్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక కొన్ని సినిమాలు ఏకంగా శుక్రవారం కూడా రీ రిలీజ్ అవుతున్నాయి.
అలా రీ రిలీజ్ అయిన సినిమాలకు కొన్ని థియేటర్లను ఇవ్వడం , వారి అభిమానులు మరియు కొంత మంది ఆడియన్స్ కూడా రీ రిలీస్ సినిమాల వైపు మొగ్గు చూపుతూ ఉండడంతో మొదటి మూడు రోజులే కీలకమైన సినిమాలకు ఆ మూడు రోజులు కూడా పెద్దగా కలెక్షన్లు రావడం లేదు. దానితో కొత్త సినిమాలకు పెద్ద సమస్య ఏర్పడుతుంది. అలాగే చిన్న సినిమాలకు కూడా ఇది పెద్ద సమస్యగా మారింది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లు అయితే ఆ తర్వాత కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంటుంది. కానీ కాస్త టాక్ అటు ఇటు అయిన సినిమాలకు మొదటి మూడు రోజులే ప్రధానం.
ఆ మూడు రోజులు కనుక ఏదైనా స్టార్ హీరో సినిమా రీ రిలీస్ అయితే ప్రేక్షకులు పెద్ద మొత్తంలో అటు మొగ్గు చూపడంతో ఆ మూడు రోజులు కూడా కలెక్షన్లు భారీగా తగ్గడంతో నిర్మాతలకు పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే జనాలు కూడా ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ సినిమాలపై అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. దానితో ఈ మధ్య కాలంలో రీ రిలీస్ అయిన సినిమాలకు భారీ మొత్తంలో కలక్షన్లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి.