పుష్ప 2 మాత్రమే కాదు 3 కూడా ఉంది.. కానీ ఎవ్వరూ ఊహించని బిగ్ ట్విస్ట్ తో..!?

Anilkumar
అల్లు అర్జున్ పుష్ప సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప పార్ట్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అల్లు అర్జున్ కెరియర్ లో పుష్ప రాజ్ క్యారెక్టర్ ఆల్ టైమ్ లో బెస్ట్ అని చెప్పవచ్చు. ఆ క్యారెక్టర్ కి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు సైతం అందుకున్నారు. బన్నీ అభిమానులు, పాన్ ఇండియా ప్రేక్షకులు పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప పార్ట్ 3 కూడా ఉందని ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. ఇండైరెక్ట్ గా సుకుమార్ కూడా పార్ట్ 3 ఉంటుందని అన్నాడు. అయితే తాజాగా పుష్ప సినిమాలో తన పాత్ర పై, పుష్ప పార్ట్ 3 పై నటుడు రావు రమేష్ ఓ

 ఇంటర్వ్యూలో మాట్లాడారు. రావు రమేష్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు కథ అంతా చెప్పి ఒక్క సీన్ మాత్రమే షూట్ చేసి మిగిలిన డేట్స్ పుష్ప 2కి వాడుకుంటాం సర్ అన్నారు. నేను ఓకే అన్నాను. పార్ట్ 2లో మాత్రం మంచి పాత్రే పడింది. చాలా డేస్ వర్క్ చేశాను. ఇప్పుడు పార్ట్ 3 అంటున్నారు. పార్ట్ 3లో కూడా నా పాత్ర ఉండొచ్చేమో అని కామెంట్స్ చేసారు.  అంతేకాకుండా పుష్ప ఫ్రాంచైజ్ లో పార్ట్ 3 కన్ఫర్మ్ అయ్యిందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.

 అల్లు అర్జున్, సుకుమార్ మధ్య ఈ సినిమా కథపై చర్చలు అయ్యాయంట. కథ నచ్చడంతో బన్నీ ఒకే చెప్పారంట. పుష్ప 2 మూవీ క్లైమాక్స్ లోనే పుష్ప 3కి సంబందించిన లీడ్ ఇచ్చే అవకాశం ఉందంట. దాని తర్వాత అఫీషియల్ ప్రకటన కూడా రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇది నిజంగా పుష్పరాజ్ ఫ్యాన్స్ కి క్రేజీ న్యూస్ అని చెప్పొచ్చు..ఇక పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు. ఈ సినిమా పౌరాణిక కథాంశంతో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా అల్ల్లు అర్జున్ ఒక మూవీ చేయనున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: