టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రం సరిపోదా శనివారం . వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా.. గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఆగస్టు 29న విడుదల కానుంది. ఇతర భాషల్లో కూడా విడుదలవుతోంది. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న సరిపోదా శనివారంలో ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. 'సరిపోదా శనివారం' సినిమా రేపు (గురువారం) విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో
నాని ముచ్చటించారు. ఇక ఈ సందర్భంగా న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ 'శనివారం దుష్టసంహారం'.. ట్రైలర్‌లోనే ఆ పాయింట్ చూపించాం. ఈ కథలో నాకు నచ్చింది కూడా అదే. దాన్ని ప్రేక్షకులకు నచ్చేలా చెప్పామా? లేదా? అనేది రేపు థియేటర్లలో చూస్తారు. 'సరిపోదా శనివారం' మంచి కథ. కథలోనే కావల్సినన్ని ఉద్వేగపూరితమైన మూమెంట్స్ ఉన్నాయి. వాటిని వందశాతానికి తీసుకెళ్లాం. ఇందులో యాక్షన్ పార్ట్ 20శాతమే. మిగతా 80శాతం యాక్షన్ మూడ్‌లో ఉంటుంది. ఆ మూడ్‌నే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. సూర్య, దయ, చారులత.. ఈ ముగ్గురు మధ్య సాగే కథ ఇది. ఈ ముగ్గరికీ సోకులపాలెం అనే ఊరికి ఉన్న
సంబంధం ఏమిటి? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. జనరల్‌గా నా సినిమాలన్నింటిలో తెలియని ఓ బరువును మోస్తుంటా. ఈ సారి మాత్రం ఆ బరువును ఎస్.జె.సూర్య, దర్శకుడు వివేక్ ఆత్రేయ మీద వేసేశా. నేను కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నా. అంటూ చెప్పుకొచ్చాడు. ఎస్.జె.సూర్యతో ఎంజాయ్ చేస్తూ నటించా. నటుడిగా ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. ఆ రోల్‌కి ఆయన తప్ప మరో ఛాయిస్ లేదు. తన పాత్రకు ఏడు రోజులు డబ్బింగ్ చెప్పారు. అద్భుతంగా వచ్చింది. అలాగే ప్రియాంక, మురళీశర్మ కూడా కథను మోసే పాత్రలే చేశారు. ఈ సినిమాలో వేస్ట్ కేరక్టర్ కనిపించదు. అంటూ తెలిపాడు నాచురల్ స్టార్ నాని..!!