ఆ ఏరియాలో కల్కి కి ఎదురు దెబ్బ.. సలార్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది..?

MADDIBOINA AJAY KUMAR
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు వచ్చాయి. కానీ సీడెడ్ ఏరియాలో మాత్రం ఈ సినిమా అత్యంత భారీ స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేక పోయింది. ఇక కల్కి సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టిన సీడెడ్ ఏరియాలో మాత్రం అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టు లో 5 వ స్థానంలో నిలిచింది. సీడెడ్ ఏరియాలో సలార్ సినిమా దగ్గరకు కూడా కల్కి సినిమా రాలేకపోయింది.

ఇకపోతే ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కల్కి సినిమా సీడెడ్ ఏరియాలో 21.8 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. సీడెడ్ ఏరియాలో ఫైనల్ బాక్స్ ఆఫీస్ రాని ముగిసే సరికి అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన మూవీల లిస్టులో ఈ మూవీ కంటే ముందు చాలా సినిమాలే ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఈ ఏరియాలో 51.04 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేయగా , బాహుబలి 2 సినిమా 34.75 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. సలార్ మొదటి భాగం 22.75 కోట్ల కలక్షన్లను వసూలు చేయగా , బాహుబలి మొదటి భాగం 21.8 కోట్ల షేర్ కలక్షన్లను ఏరియాలో రాబట్టింది. ఈ నాలుగు మూవీల తర్వాత కల్కి సినిమా 21.80 కోట్ల షేర్ కలెక్షన్లతో సీడెడ్ ఏరియాలో ఐదవ స్థానంలో నిలిచింది.

ఇలా కల్కి సినిమా ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సీడెడ్ ఏరియాలో మాత్రం అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఐదవ స్థానంలో ఉంది. ఈ సినిమాలో దిశా పటానీ , ప్రభాస్ కి జోడిగా నటించగా ... నాగ్ అశ్విన్ మూవీ కి దర్శకత్వం వహించాడు. అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించగా ... వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను అశ్విని దత్ కూతురు స్వప్న దత్ నిర్మించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: