హేమ కమిటీ రిపోర్ట్ చూసి షాక్ అయిన సీనియర్ హీరోయిన్..!
మహిళ రక్షణ కోసమే ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలంటే తెలియజేసింది. అలాగే బాధితులను కూడా ఎప్పటికీ మద్దతు ఇస్తూనే ఉండాలి అని తెలిపింది. మహిళల పట్ల ఇలాంటివి చేసే వారిని శిక్షపడేలా చూడాలంటూ ఊర్వశి తెలియజేసింది. జస్టిస్ హేమ కమిటీలో రిపోర్టులు ప్రకారం.. తనలాంటి ఎంతోమంది మహిళలు జీవన ఉపాధి కోసం ఇండస్ట్రీలో పని చేస్తున్నారని.. అయితే వారు ఇలాంటి వారి మధ్య పని చేస్తున్నారని తెలిసి భయమేస్తోంది అంటూ తెలుపుతోంది.
వ్యక్తిగతంగా తనకు ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితులయితే ఎదురు కాలేదు. కానీ ఆ రోజుల్లో తాను స్టార్ హీరోయిన్గా కొనసాగిన తల్లితండ్రులు సైతం ప్రతిక్షణం తనకు సపోర్టుగా ఉంటూ తన వెంటే ఉంటూ అన్ని విషయాలను చెక్ చేస్తూ ఉండేవారని తెలిపింది. ఇలాంటి పరిస్థితులు మలయాళ ఇండస్ట్రీలోనే కాదు అన్ని ఇండస్ట్రీలో జరుగుతున్నాయని.. నటీనటులు కలిసి పని చేసినప్పుడే చాలా మంచి సినిమాలు తీయగలం ఇలాంటి పరిస్థితులు మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే ప్రభుత్వాలు వెంటనే ఈ సమస్యల పైన పలు రకాల చర్యలు తీసుకొని మహిళలకు రక్షణ కల్పించాలి అంటూ తెలుపుతోంది. అయితే ఇప్పటివరకు ఆ హేమ కమిటీలు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారనే విషయం మాత్రం బయటకు చెప్పలేదు.