ఇండస్ట్రీ లోకి రాకముందు కీర్తి సురేష్ ఏం చేసేవారో తెలుసా..?

Divya
మహానటి కీర్తి సురేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగు , తమిళ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. నేను శైలజ సినిమా చేసి తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్, తొలి సినిమాతోనే మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈమె తల్లి మేనక కూడా ఇండస్ట్రీలో నటిగా కొనసాగారు. తల్లి నటీ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో చైల్డ్ యాక్టర్ గా ఇండస్ట్రీలోకి వచ్చారు కీర్తి సురేష్.

ఇక చదువు నిమిత్తం మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె నేను శైలజ సినిమాతో మంచి విజయం అందుకుని , ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంలో నటించి, తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. అంతేకాదు మహానటి సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కి జాతీయ అవార్డు కూడా లభించింది.. ప్రస్తుతం తెలుగు , మలయాళం,  తమిళ్ వంటి పాన్ ఇండియా భాషలలో కూడా ప్రాముఖ్యతను సొంతం చేసుకున్న ఈమె తెలుగులో చాలామంది స్టార్ హీరోల సరసన నటించింది.
ఈమె నటించిన రఘు తాతా సినిమా ఆగస్టు 15న సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తన మొదటి జీతం రూ.500 అని తెలిపింది. ఇండస్ట్రీలోకి రాకముందు మొదటిసారి ఫ్యాషన్ షోలలో బట్టలు సరి చేసే పని చేసిందట కీర్తి సురేష్ . ఇందుకోసం రోజుకు వేతనంగా 500 రూపాయలు ఇచ్చారట. ఇక ఇదే తన తొలి సంపాదన అంటూ తెలిపింది కీర్తి సురేష్ ..ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి . ఏది ఏమైనా ఒకప్పుడు అలాంటి పని చేసి ఇప్పుడు ఏకంగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ,  ఏదైనా సరే కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అని నిరూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: