ఈ రాజమౌళి సినిమాలకు మొదట అట్టర్‌ఫ్లాప్ టాక్ వచ్చిందని మీకు తెలుసా..?

praveen

ఒక మాములు టీవీ సీరియల్ డైరెక్టర్ గా తన వృత్తిని ప్రారంభించిన దర్శక దిగ్గజం రాజమౌళి నేడు ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప డైరెక్టర్ అయ్యాడు. ఈరోజు రాజమౌళి అంటే ప్రపంచంలో తెలియని వారు ఉండరేమో. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా బాహుబలి రాజమౌళి స్థాయిని బాగా పెంచేసింది. ఇప్పటిదాకా ఈ దర్శకుడికి ఫ్లాప్ అంటే ఏంటో కూడా తెలియదు. తీసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ వస్తున్నాయి.
అయితే రాజమౌళి సినిమాల్లో కొన్ని మొదట అట్టర్ ఫ్లాప్ టాక్‌ తెచ్చుకున్నాయి. ఆ తర్వాత ఆ టాక్ అనేది వెంటనే తొలగిపోవడం, తర్వాత ఆ సినిమా సూపర్ హిట్ కావడం జరిగింది. బాహుబలి రిలీజ్ అయిన సమయంలో కూడా "సినిమాలో అన్ని బిస్కెట్లే వేశారు" అంటూ నెగిటివ్ రివ్యూ వచ్చింది. కానీ తర్వాత ఈ మూవీని పనిగట్టుకొని మరీ థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు పోటెత్తారు.
 కానీ మొదట ఇలాంటి నెగటివ్ టాక్ వస్తే రాజమౌళి చాలా డిసప్పాయింట్ అవుతారట. అంతే కాదు ఆయన ఏడుస్తూ, నిద్రపోకుండా గడిపిన రాత్రులు కూడా ఉన్నాయట. రామ్ చరణ్, కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘మగధీర’ సినిమా తొలి రోజు చాలా నెగటివ్ టాక్‌ వచ్చింది. ఈ మూవీ ఫ్లాప్ అవుతుందనే ఒక మౌత్ టాక్ దావానలంగా వ్యాపించింది. ఈ మూవీని 45 కోట్ల రూపాయలు పెట్టి తీశారు. చాలా రోజులు కష్టపడి రాజమౌళి దీనిని తెరకెక్కించాడు. తాను పడిన కష్టానికి మంచి ప్రతిఫలం దక్కుతుందని, ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందని ఎంతో ఆశపడ్డారు. కానీ మొదటి రోజే అట్టర్ ప్లాప్ అని రావడంతో తీవ్రంగా బాధపడ్డారు.
 మెగాస్టార్ చిరంజీవి, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి ఏం సమాధానం చెప్పాలో కూడా అతనికి అర్థం కాలేదు. ఇంత బడ్జెట్ నుంచి సినిమా ఫ్లాప్ అయితే తన కెరీర్ కూడా క్లోజ్ అవుతుందని అనుకున్నాడట. అయితే ఓ రోజు గడిచిన తర్వాత అల్లు అరవింద్ రాజమౌళి కి ఫోన్ చేసి మన సినిమా హిట్ అయిపోయింది అంటూ చాలా గుడ్ న్యూస్ చెప్పాడంట. ఇంకా ఆ తర్వాత ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది.
 ఇక బాహుబలి సినిమా విషయంలో కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది. దీన్ని కూడా చాలా సంవత్సరాలు కష్టపడి ఎంతో బడ్జెట్ పెట్టి రాజమౌళి తీశాడు. హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ మూవీ సూపర్ హిట్ అంటూ కామెంట్ చేయడం మొదలుపెడితే తెలుగు వారం మాత్రమే ఇదొక పెద్ద డిజాస్టర్ ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ తప్ప ఏమీ లేవు అంటూ పెద్ద షాకిచ్చారు. ఆ మాటలు విని రాజమౌళికి గుండె ఆగినంత పని అయిందట. కానీ తర్వాత సినిమాలోని గొప్పతనం తెలియడంతో ప్రేక్షకులే దాన్ని టాలీవుడ్ చరిత్రలోనే గొప్ప హిట్‌గా మలిచారు. రాజమౌళి చాలా కష్టపడతారు తన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోతే బాగా బాధపడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: