పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను సాధించాలనుకున్న రాజకీయ కార్యాన్ని అయితే సాధించాడు. ఇక ఇప్పుడు సినీ కార్యమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్స్ వరుస పెట్టి పవన్ ని కలుస్తున్నారు.ప్రజల మీద చూపించే ప్రేమ అభిమానాలు మా మీద కూడా చూపించే సమయం ఆసన్నమైందని గుర్తు చేస్తున్నారు. పవన్ చేతిలో ఓజి ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు వంటి భారీ బడ్జట్ మూవీస్ ఉన్నాయనే విషయం అందరకి తెలిసిందే. పైగా ఆ మూడు కూడా కొంత భాగం షూటింగ్ జరుపుకున్నవే. ఓజి అయితే కాస్త ఎక్కువగానే కంప్లీట్ చేసుకుంది. అయితే వాస్తవానికి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి సినిమా
లకు సమయం కేటాయించలేకపోతున్నారు..పవన్ కల్యాణ్. దీంతో ఆయనతో సినిమా లు చేస్తున్న నిర్మాతల పరిస్థితి..నిప్పుల మీద నడకలా ఉంది. అయితే అన్నీ తెలిసే పవన్‌తో కమిట్ అయ్యామని..ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సినిమా ను పూర్తి చేస్తామంటున్నారు నిర్మాతలు. ఎన్నికలకు ముందు రోజుకు 2 నుంచి 3 కోట్లు తీసుకొని..30 రోజుల్లో లు పూర్తి చేశారు పవన్. బ్రో, భీమ్లా నాయక్ లాంటి సినిమాలు అలా పూర్తి చేసినవే. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉండడంతో సమయం కేటాయించలేకపోతున్నారు పవన్. అయితే తాజాగా అన్నమయ్య జిల్లాలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్.
ఈ సందర్భంగా పవన్ అభిమానులు..ఓజీ, ఓజీ అంటూ నినాదాలు చేశారు. సుజిత్ డైరెక్షన్లో వస్తున్న ఈ OG పై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. అభిమానాలు నినాదాలపై స్పందించిన పవన్ కల్యాణ్.. తనకు ల కన్నా సమాజం, దేశమే ముఖ్యమన్నారు. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయన్నారు. దాంతో పవన్..ఇక లకు పూర్తిగా దూరం జరగనున్నారన్న..ఊహాగానాలు ఎక్కువయ్యాయి.. మరి ఈ విషయంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.!!