కాస్టింగ్ కౌచ్ నాకు కూడా తప్పలేదు.. మంచు లక్ష్మి షాక్ లో ఫ్యాన్స్..!
మంచు లక్ష్మి నటిగానే కాకుండా నిర్మాతగా కూడా పలు చిత్రాలకు వ్యవహరించింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో ఆడవాళ్లు పైన లైంగిక వేధింపుల విషయం పైన జస్టిస్ హేమ కమిటీ ఇటీవల రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్టు పైన మంచు లక్ష్మి మాట్లాడుతూ కెరియర్ ప్రారంభంలో తనను కూడా చాలామంది వేధించారంటూ తెలియజేసింది. ఈ విషయం విన్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. జీవితంలో మహిళలకే అన్యాయం జరుగుతోంది కేవలం అది సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇతర వాటిలో కూడా ఆడవాళ్లు బాధితులు గానే ఉంటున్నారంటూ తెలియజేసింది. వీటిని మనం ఎలా మార్చగలం.. కేవలం ఆడవాళ్లు మాత్రమే వీటి మీద పోరాడాల్సి వస్తోంది అంటూ తెలియజేసింది మంచు లక్ష్మి
కెరియర్ ప్రారంభంలో తనను కూడా చాలామంది కింద పడేయాలని చూశారని కానీ తాను అలాంటివన్నీ కూడా తట్టుకోవడం నిలబడ్డాను.. ఆ సమయంలో తాను చాలా కోల్పోయి ఉండవచ్చు కానీ తనని పడేయలేని వ్యక్తికి తాను ఎదుగుతున్నానని తెలుసుకొనేలా చేశాను.. అయితే ఇలాంటి విషయాలను మహిళలు బయట ఎలా ధైర్యంగా చెప్పాలో అర్థం కాలేకనే తప్పుగా చాలామంది ప్రవర్తిస్తున్నారని అలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలి అంటూ తెలియజేసింది. తనకు కూడా ఎన్నో అవకాశాలు మిస్ అయ్యాయని తెలియజేసింది మంచు లక్ష్మి.