పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడు నటుడు అర్షద్ వార్సి తాజాగా ‘కల్కి 2898 AD’పై చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. కల్కి చిత్రంలో ప్రభాస్ జోకర్లా కనిపించారంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు.
డార్లింగ్ ప్రభాస్ కల్కి సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రం 50 రోజులు విజయవంతంగా రన్ అవ్వడంతో నాగ్ అశ్విన్ జనరల్ ఆడియెన్స్‌తో కలిసి సినిమాను చూశాడు. ఈ యాభై రోజుల్లో దాదాపుగా ఈ చిత్రం 1200 కోట్లను కొల్లగొట్టినట్టుగా సమాచారం. వెయ్యి కోట్ల మార్క్‌ను దాటిన తరువాత బిగ్ బీ అమితాబ్ చెప్పిన మాటలు బాగానే వైరల్ అయ్యాయి. ప్రభాస్‌కు ఇలా వెయ్యి కోట్లు కొల్లగొట్టడం కొత్తేమీ కాదు.. అతనికి అలవాటు అయింది.. కానీ ఇలా వెయ్యి కోట్లు రావడం అనేది నా కెరీర్లోనే మొదటి సారి అని అమితాబ్ అన్నాడు.అమితాబ్, ప్రభాస్ ఇద్దరూ ఈ సినిమాను మోశారు. అందులో సందేహమే లేదు. అలా అని ఈ సక్సెస్ క్రెడిట్స్‌లో కేవలం బిగ్ బికి మాత్రమే ఇస్తే కరెక్ట్ కాదు. బాలీవుడ్ జనాలు మాత్రం ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తానికి అమితాబ్ ఖాతాలో వేయాలని ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
తాజాగా ఓ బాలీవుడ్ నటుడు ప్రభాస్, కల్కి సినిమాల మీద కౌంటర్ వేశాడు. మన డార్లింగ్‌ను తక్కువ చేసి మాట్లాడినట్టుగా అనిపిస్తోంది.కల్కి చూశానని, ఏమంతగా నచ్చలేదని, మ్యాడ్ మ్యాక్స్ రేంజ్లో తీయొచ్చని, కానీ దర్శకుడు, హీరో ఫెయిల్ అయ్యారని అన్నాడు. పైగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ జోకర్లా అనిపించాడంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మాటలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. ఇలా ఎప్పుడూ ఎవరో ఒకరు.. ఎక్కడో చోట ప్రభాస్ మీద ఏడుస్తూనే ఉంటారని డార్లింగ్ అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు. ఇదిలావుండగా తాజాగా నటుడు ఆది సాయికుమార్ కూడా ఖండించారు.ఎలాంటి అభద్రతా భావం లేని నటుడు ప్రభాస్ అన్న. ఆయన లేకపోతే అసలు కల్కి సినిమానే లేదు. ఆయన రోల్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. బహుశా ఆయనంటే అతడికి అసూయేమో` అని పోస్టు చేసారు.దీంతో అర్షద్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపోతున్నారు. ప్రభాస్ అభిమానులు అర్షద్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. టాలీవుడ్‌ను అనేముందు బాలీవుడ్ ఎలా ఉందో చూసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్షద్ వార్సికి వ్యతిరేకంగా వరుస పోస్టులు పెడుతూ.. తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.