బెస్ట్ హర్రర్ మూవీ డిమోంటే కాలనీ -2 ..తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే..?
అన్ని చోట్ల కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటుగా కలెక్షన్స్ కు కూడా బాగానే సంపాదించుకుంది. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చేస్తున్నారు. వారికి తాజాగా ఒక గుడ్ న్యూస్ ని తెలియజేసింది చిత్ర బృందం. ఈ చిత్రాన్ని ఆగస్టు 23న తెలుగులో రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేశారు. ఇందులో అరుల్ నిధి, ప్రియా భవాని శంకర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. తమిళంలో తంగలాన్ వంటి సినిమాతో పోటీపడి మరి ఈ సినిమా కలెక్షన్స్ రాబడుతోందట.
ఈ చిత్రానికి అజయ్ ఆర్ జ్ఞానముతో దర్శకత్వం వహించారు. రాజు వర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా భయపెట్టేలా ఉన్నది. ఇప్పుడు తాజాగా రిలీజ్ తేదీని కూడా అనౌన్స్మెంట్ చేయడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. హర్రర్ మూవీస్ లో బెస్ట్ హర్రర్ మూవీ చిత్రంగా డీమాంటే కాలనీ -2 పేరు సంపాదించుకుంటోంది. మరి ఏ విధంగా మరొకసారి ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి మరి.