హాలీవుడ్ రేంజ్ లో విజయ్ ది గొట్ ట్రైలర్..!

Divya
తమిళంలో స్టార్ హీరోగా పేరు పొందిన విజయ్ దళపతి ప్రస్తుతం డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో దిగొట్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటిస్తూ ఉన్నారు విజయ్ దళపతి. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. హీరోయిన్గా మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది. అలాగే అలనాటి హీరోయిన్స్ స్నేహ, లయ వంటి వారు కూడా ఇందులో నటిస్తూ ఉండడం గమనార్హం. టైం ట్రావెల్ ,సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ వెంకట ప్రభు. వినాయక పండుగ సందర్భంగా సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతోంది.

మరో 13 రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలో చిత్ర బృందం ప్రమోషన్స్ని వేగవంతం చేశారు. ఇలాంటి సమయంలోనే తాజాగా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ విషయానికి వస్తే ఇందులో విజయ్ స్టైల్ ,మేనరిజం కూడా అందరిని ఆకట్టుకునేలా ఉన్నది. ఇక ట్రైలర్ లోనే విశ్వరూపం చూపించేశారని కూడా అభిమానులు తెలియజేస్తున్నారు. ట్రైలర్లో చూపించిన విధంగా విజయ్, మీనాక్షి కెమిస్ట్రీ కూడా అదుర్స్ అనేలా కనిపిస్తోంది. ఇందులోని సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్ లో తలపించేలా ఉన్నాయి.మరి వెండితెర పైన ఎలా ఉంటుందో చూడాలి.

విజయ్ చివరిగా నటించిన చిత్రం లియో.. ఈ సినిమాకి డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించేగా మంచి విజయాన్ని అందుకుంది. ఏకంగా ఈ సినిమా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు గోట్ సినిమాతో 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. భారీ అంచనాలు మధ్య విడుదలవుతున్న ఈ గోట్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.. ఇందులో చాలామంది సీనియర్ నటీనటులు కూడా నటిస్తూ ఉన్నారు. తెలుగులో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుదేవా, జయరామ్, యోగిబాబు, అమీర్ తదితరులు నటిస్తూ ఉన్నారు. లియో సినిమాతో అభిమానులను నిరాశపరిచిన మరి గోట్ సినిమా మెప్పిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: