వాళ్లని మేమే చెడగొట్టం.. అందుకే ఇలాంటి పరిస్థితి.. దిల్ రాజు..!

frame వాళ్లని మేమే చెడగొట్టం.. అందుకే ఇలాంటి పరిస్థితి.. దిల్ రాజు..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలను నిర్మించాడు. ఈయన కెరియర్ ప్రారంభించిన కొత్తలో చాలా వరకు కొత్త దర్శకులతో సినిమాలను నిర్మించాడు. అలాగే వాటితో చాలా వరకు అద్భుతమైన స్థాయి విజయాలను అందుకున్నాడు. దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ గుర్తింపు వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం దిల్ రాజు తెలుగు సినిమాలతో పాటు ఇతర భాష సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఈయన తమిళ్ లో స్టార్ హీరో అయినటువంటి తలపతి విజయ్ తో వారిసు అనే సినిమాను నిర్మించాడు.

ఇకపోతే తాజాగా ఈ నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని నిర్మించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ పై ప్రస్తుతానికి ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు ఓ సినిమా ఈవెంట్ కి అతిథిగా వచ్చాడు. అందులో భాగంగా ఈయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా సినిమా ఈవెంట్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... సినిమా విడుదల అయిన నాలుగో వారాలకే ఓ టీ టీ లోకి వస్తుంది మీరు ఇంట్లో కూర్చొని చూడండి అనే సిస్టమ్ ను మేమే అలవాటు చేశాం. దానితో జనాలు కూడా చాలా వరకు థియేటర్ లకి వచ్చి సినిమా చూడడం కంటే ఓ టీ టీ లోనే సినిమా చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇదంతా జరగడానికి మేమే కారణం అని దిల్ రాజు తాజా ఈవెంట్ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: