ఆ స్టెప్ నాకూ నచ్చలేదు.. హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!!

murali krishna
మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన మూవీ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌. హరీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కింది. బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఈ మూవీ నేడు (ఆగ‌స్టు 15) న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది.రవితేజ ఏ సినిమాకైనా చాలా కష్టపడతాడని తెలిసిందే.ఈ సినిమాకి కూడా తన ఎనర్జీని అంతా పెట్టి ఫుల్ యాక్టివ్ గా నటించాడు. భాగ్యశ్రీ భోర్సే మాత్రం తన అందంతో అందర్నీ మెప్పిస్తుంది. నటనలో పర్వాలేదనిపించింది. జగపతి బాబు విలన్ పాత్రలో బాగా నటించాడు. సత్య తన కామెడీతో నవ్విస్తాడు. తనికెళ్ళ భరణి, గౌతమి, సచిన్ ఖేద్కర్, శుభలేఖ సుధాకర్.. మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి. ఎప్పుడూ మెలోడీ మ్యూజిక్ తో మెప్పించే మిక్కీ జె మేయర్ ఈ సారి ఫుల్ మాస్ సాంగ్స్, మాస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టాడు. కథ బాలీవుడ్ సినిమాది తీసుకున్నా కథనం మాత్రం చాలా రెగ్యులర్ రొటీన్ మాస్ మసాలా సినిమాలా రాసుకున్నారు. దర్శకత్వం పరంగా హరీష్ శంకర్ బాగానే తీసినా తన రీమేక్ మార్క్ ఎక్కడో మిస్ అయిందనిపిస్తుంది. పీపుల్ మీడియా సంస్థ సినిమాకు బాగా ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.రీమేక్ సినిమా అయినా హ‌రీష్‌ వాటిని త‌న‌దైన శైలిలో బాగా తీస్తాడ‌ని పేరుంద‌ని, అలాగే మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ను కూడా త‌న‌దైన శైలిలో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో చూపిస్తాడ‌ని భావించిన‌ట్లుగా చెబుతున్నారు.

 సినిమాలో అస‌లు పాయింట్ రైడ్ అయితే.. దాన్ని ప‌క్క‌న బెట్టి.. పాట‌లు, వాటి కోస‌మే స్టోరీ అన్న‌ట్లుగా రాసుకున్నాడ‌ని మండిప‌డుతున్నారు.సినిమాలో కంటెంట్ ఉంద‌ని, డైరెక్ష‌న్ మిస్సైంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పాట‌ల కోస‌మే సినిమా తీశాడ‌ని, తామెన్నో అంచ‌నాలో మూవీకి వ‌చ్చామ‌ని ఆ స్థాయిలో సినిమా లేదంటున్నారు.
ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ సినిమాలోని సితార సాంగ్లో హీరోయిన్ తో అసభ్యకరంగా రవితేజ చేసిన స్టెప్పులపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై  డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు. ఆ స్టెప్ నాకు కూడా అసభ్యకరంగా అనిపించింది. కానీ ఫస్ట్ డే షూట్ లోనే శేఖర్ మాస్టర్ కు వద్దని చెప్తే బాగుండదని వదిలేసా. డాన్స్ చూస్తే ఇబ్బందిగా అనిపించదు. కానీ స్క్రీన్ షాట్ తీసి భూతద్దంలో చూస్తే ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పారు. ‘మిస్టర్ బచ్చన్’ అంటూ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. రవితేజ నటనతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ సీన్స్, అలాగే మాస్ ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఐతే, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, సినిమాలో ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోవడం ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా ఆకట్టుకోలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే ఈ చిత్రంలో కనెక్ట్ అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: