మహేష్ బాబు చేసిన పనికి అవన్నీ బయటపెట్టిన అక్కినేని కోడలు

frame మహేష్ బాబు చేసిన పనికి అవన్నీ బయటపెట్టిన అక్కినేని కోడలు

praveen
టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ అక్కినేని ఇంటికి కోడలు అవుతున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల నుంచి ఈ వార్తలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెట్టింట ఎక్కడ చూసినా కూడా శోభిత పేరే వినిపిస్తోంది. ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్ లోకి గూఢచారి మూవీలో ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చింది. సినీ ఇండస్ట్రీలోకి అయితే రామన్ రాఘవ్ 2.0 అనే మూవీతో పరిచయం అయ్యింది. తన కెరీర్ మొదట్లో మోడల్‌గా రాణించిన ఈ చిన్నది చాలా యాడ్స్‌లో నటించింది. ఆ తర్వాత హిందీలో మూడు సినిమాల్లో నటించాక తెలుగులో అవకాశం వచ్చింది. ఇక గూఢచారి మూవీ తర్వాత హిందీలో వరుసగా మూవీ ఆఫర్స్ వచ్చాయి. తమిళ్‌లో మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ మూవీలో నటించి తన నటనతో మంచి మార్కులు తెచ్చుకుంది.
ఇక అడివిశేష్ తోనే మేజర్ అనే మరో మూవీలో శోభిత ధూళిపాళ నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించింది. 2022 జూన్ 3వ తేది విడుదలైన ఈ మూవీతో శోభిత క్రేజ్ అమాంతం పెరిగిందని చెప్పాలి.  ఆ తర్వాత హాలీవుడ్‌లో మంకీ మ్యాన్ అనే మూవీలో శోభిత నటించింది. ఇక ఇటీవలే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లికి సిద్ధమైంది. ఈ మధ్యనే శోభిత, నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే.
మేజర్ మూవీ టైంలో హీరో అడివిశేష్, శోభితతో కలిసి మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో శోభిత తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. ఆ ఇంటర్వ్యూలో శోభితను మహేష్ బాబు తన  జర్నీ గురించి చెప్పమన్నారు. అయితే శోభిత తడబడకుండా ఇంగ్లీష్‌లో తన జర్నీ విశేషాలను చెప్పడం మొదలుపెట్టింది. వెంటనే మహేష్ బాబు కలగజేసుకుని తెలుగులో మాట్లాడమని కోరాడు. కుదిరితో తన యాసలో మాట్లాడాలని కోరగా ఇక శోభిత తన జీవిత విశేషాలను బయటపెట్టింది. తాను పుట్టింది తెనాలిలో అని, వైజాగ్‌లో పెరిగినట్లు చెప్పుకొచ్చింది. కాలేజీ చదువంతా ముంబైలో జరిగిందని, మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొన్నట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: