టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ డైరెక్టర్
అనీల్ రావిపూడి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. సినీ కెరీర్లో కామెడీతో పాటుగా మాస్ ఎలిమెంట్స్‌తో అనీల్ వరుస విజయాలు అందుకున్నారు. టీవీ షోలలో కూడా కనిపిస్తూ ప్రత్యేక ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. అయితే ఆయన హీరోగా అవుతారని ఎవ్వరూ ఊహించలేదు. అనీల్ రావిపూడి దగ్గర ఓ నిర్మాత ఈ ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు కొన్ని కండీషన్స్ కూడా పెట్టి సినిమా చేస్తానని అనీల్ రావిపూడి ఒప్పుకున్నారట. ప్రస్తుతం ఈ టాకే ఫిల్మ్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. తాను చీప్ సినిమాలో చేయనని, అలాగే మినిమం రూ.20 కోట్లు పెట్టగలిగే సినిమాల్లోనే చేస్తానని అనీల్ కండీషన్స్ పెట్టారట. అలాగే తన సినిమాలో ఓ స్టార్ హీరోకు కూడా గెస్ట్ రోల్ ఇచ్చి బిజినెస్ చేద్దామని అనీల్ చెప్పారట. అన్నీ కండీషన్స్ విన్న ఆ నిర్మాత మూవీ చేసేందుకు ఓకే చెప్పేశారట.
దీంతో అనీల్ తన సినిమా కోసం బరువు తగ్గి ఫిట్‌గా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అనీల్ రావిపూడిని హీరోగా చేయాలని దిల్ రాజు అనుకుంటున్నారని కొందరు అంటే మరికొందరేమో వీవీ వినాయక్ అని గెస్ చేస్తున్నారు. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ తెరకెక్కుతోంది. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో ఎఫ్2, ఎఫ్3 లాంటి సినిమాలు వచ్చి హిట్ కొట్టి సంగతి తెలిసిందే.